Home / News / ఏపిలో ఉన్న ఒక మహిళామణి పుణ్యమే ఈ ఇటి దాడులు అంటున్న శివాజీ.. ఇంతకీ ఎవరా మహిళామణి ?

ఏపిలో ఉన్న ఒక మహిళామణి పుణ్యమే ఈ ఇటి దాడులు అంటున్న శివాజీ.. ఇంతకీ ఎవరా మహిళామణి ?

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, శుక్రవారం ఏపీలో జరిగిన ఐటీ సోదాలపై హీరో శివాజీ మీడియాతో మాట్లాడారు. ఏకకాలంలో సోదాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి ముప్పుందని తాను ముందే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి శివాజీ గుర్తు చేశారు. చంద్రబాబుపై కోపం ఉంటే ఎన్‌కౌంటర్‌ చేయండని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ఉన్న నలుగురు, ఈ నలుగురిలో ఉన్న ఒక మహిళామణి కలిసి, ఢిల్లీలో చేసిన తతంగమే ఈ ఐటి దాడులని శివాజీ అన్నారు. అయితే, ఆ మహిళామణి పేరు చెప్పటానికి మాత్రం ఆయన నిరాకరించారు. నా మాటలు వింటే ఎవరో తెలుస్తుందని, పేర్లు చెప్తే, నన్ను లీగాల్ ఇరికించటానికి రెడీగా ఉన్నారని అన్నారు.

sivaji 06102018

“ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర చేస్తున్నారు. ఏపీకి చెందిన నలుగురైదుగురు ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారు. బీజేపీ నేత జీవీఎల్‌ అర్థంలేకుండా మాట్లాడుతున్నారు. ఏపీ ప్రజలు పిచ్చోళ్లని అనుకుంటున్నారా?. సొంత ఆదాయం, ప్రయోజనాల కోసం మోసం చేస్తున్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని మోదీ చెప్పలేదని, మార్ఫింగ్‌ చేశారని అంటున్నారు. మోదీ రెచ్చగొట్టి పంపడంతోనే ఇలాంటి ఘటనలు ఏపీలో జరుగుతున్నాయి. ప్రత్యేకహోదా లేకుంటే ఏపీ అభివృద్ధి చెందదు. హోదాపై జగన్‌, పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదు. నవంబర్‌ 2వ వారం నుంచి హోదా సైన్యాన్ని తయారుచేస్తున్నాం. గొప్ప సైన్యం ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదు. అన్ని పార్టీలు కలిస్తేనే ప్రత్యేక తెలంగాణ వచ్చింది” అని శివాజీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

“ఏపీకి ఇంతకంటే చీకటిరోజు ఉండదేమో.?. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చంద్రబాబే లక్ష్యమైతే ఎన్‌కౌంటర్ చేయండి. బాబును ఎన్‌కౌంటర్ చేయడానికి కూడా కేంద్రం వెనకాడదు. డిసెంబర్‌లో జరగాల్సిన ఐటీ దాడులు ఈ రోజే జరిగాయి. మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పలేదనడం దుర్మార్గం. బీజేపీ నేతలకు సినిమా అంటే ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తాం. రేవంత్ ఆస్తుల గురించి ఎవరు సమాచారం ఇచ్చారో ఏపీలో ఐటీ సోదాలకు సంబంధించి కూడా అతనే సమాచారం ఇచ్చారు. మీడియాకు ముందే సమాచారం తెలియడంతో ఐటీ అధికారులు ప్లాన్ మార్చారు” అని శివాజీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *