Home / Tourism Places / Macharla / తేరాల

తేరాల

 

మాచర్ల కు 5 కి.మీ.దూరంలో ఉన్న తేరాల గ్రామం లోని శ్ర్రీ భ్రమరాంభిక సిద్దేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ శివుడిని ఆరాధిం చిన వారి కోరికలు వెంటనే సిద్దిస్తాయి కాబట్టి సిద్దేశ్వర స్వామి గా పేరు వచ్చించి.సుందర మనోహర ఆయయ నిర్మాణం.ప్రశాంతత కు నిలయం లా ఉండే ఈ దేవాలయాన్ని పరశురాముడు నిర్మించారని చెపుతారు. పరశురాముడు బ్రహ్మహత్యా పాప నివారణకు ఈ ప్రాంతం కు వచ్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్ష్యమయి ఈ ప్రాంతంలోశివాలయం నిర్మించమని చెప్పగా,పరశురాముడు ఈ దేవాలయం నిర్మించాడు.దేవాలయం ఎదురుగా ఒక కోనేరు నిర్మించి దానిలో స్నానమాచరించి శివలింగం ప్రతిష్ట చేయాలను కోగా, పరశురాముడు కోనేరు లోకి దిగగానే కోనేరు లోని నీరు రక్త వర్ణం లోకి మారతాయి.కలత చెంది శివుణ్ని ప్రార్ధించగా విభూతి ప్రసాదిస్తాడు. విభూతి ని కోనేరు  లో వేయగానే నీరు విభూతి రంగు లో మారతాయి.నేటికి ఆ కోనేరు కు విభూధి గుండం అని పేరు.నేటికి అందులో నీరు  ఆ రంగులోనే వుంటాయి.స్నానమాచరించి శివలింగం ను ప్రతిష్టించ బోగా స్యయం భూ గా శివలింగం ఏర్పాటు అవుతుంది.ఈ దేవాలయ ముఖ ద్వారం పడమర వైపు వుండటం విశేషం. కొన్ని వందల సం; క్రితమే ఈ కీకారణ్యం లో భారీ రాళ్ళతో ఈ ఆలయ నిర్మాణం జరపటం విశేషం.నేటికి జనసంచారం లేని ఈ ప్రాంతంలో ఇంతటి మనోహర నిర్మాణం దైవ సృష్టి కి నిదర్శణం. రావి చెట్టు మర్రి చెట్టుకలసి వుండటం ఈ ఆలయ ప్రాంగణం లో మరో అధ్బుతం. గో గర్బం అనే ప్రత్యేక నిర్మాణం లో అతి చిన్న ద్వారం లో ఎంత లావు వారు అయినా దీనిలో నుంచి వెళ్లి దైవ దర్శనం  చేసుకోవటం ఇక్కడ అబ్బుర పరిచేవిషయం.ఆద్వారం చూస్తే అతి సన్నని వారు కూడా పట్టరు అనిపిస్తుంది.భక్తి తో శివున్ని తలుచుకుని ద్వారంలొకి ప్రవేశిస్తే ఎంతటి లావు వారు అయినా ఆ ప్రదేశం లో రావచ్చు.ఈ కట్టడం.కాశీక్షేత్రం లోను మరియు ఇక్కడ మాత్రమే కలదని చెపుతారు.గుడి లోపల పరశురాముని ప్రతిమ భ్రమరాంభికా తల్లి శిల్పాలు అతి మనోహరంగా ఉంటాయి.శివున్ని మనం ప్రత్యక్షముగా అభిషేకించే భాగ్యం ఈ దేవాలయం లో మనకి కల్పిస్తారు.ఈ దేవాలయం సందర్శించిన వారు ఆ వాతావరణం ను ప్రశంసించకుండా ఉండలేరు.దేవాలయం బయట ఈ ఆలయానికి సంభందించి రాజులు వేయించిన శాసనాలు కనపడతాయి.ఈ దేవాలయానికి తేరాల గ్రామం కూడా కిలో మీటర్ పైగా దూరంలో ఉంది.ఇప్పటికే సరి అయిన రోడ్దు మార్గం లేని ఈ ఆలయాన్నిఎలా నిర్మంచారు?.అంత భారీ రాళ్ళను ఎలా ఈ ప్రాంతానికిఎలా తరలించారు?.అద్బుతం,మనోహరం,సుందరమయిన ఈ ఆలయాన్ని చూడని వారు దర్శించండి.శివరాత్రి,కార్తీక మాసం లో భక్తులు ఇక్కడ కు ఎక్కువ వస్తుంటారు.మిగతా రోజుల్లో కొంచెం తక్కువ రోడ్డు,మార్గం సరిగ్గా  వుంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.విశాలమయిన ఈ దేవాలయ ప్రాంతం కార్తీక వనభోజనాలకు బాగా ఉపయోగ పడుతుంది.ఈ దేవాలయం చూసిన ప్రతి ఒక్కరు ఇంతటి అరణ్యంలో కొన్ని వందల సం:క్రితమే ఈ దేవాలయం  అధ్బుతంగ నిర్మించారు అని  అనుకొంటారు. ఈ దేవాలయం సందర్శించి శివుణ్ని అభిషేకించిన వారి కోరికలు సిద్దిస్తుంటాయని అంటారు.మీరు దర్శించండి.సుందర మనోహర ప్రాంతాన్ని ఆస్వాదించండి.

రచయిత వేముల శ్రీనివాసరావు మాచర్ల

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *