Home / Tourism Places / Macharla / శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు

శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు

      గుంటూరు జిల్లాలో దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామ సమీపంలో నిదానం పాడు లో వెలసిన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి గ్రురించి తెలుసుకుందాం. అమ్మవారి కధ పొటోలతో సహా మరోసారి పెడుతున్నాం పరిశీలించండి. పల్నాటి ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు చదివి తెలుసుకోవాలిసిన గొప్ప చరిత్ర. ద్వాపర యుగాంతంలో కైలాసం లో పార్వతి పరమేశ్వరులు కొలువుదీరి వుండగా నారదుడు మరియు నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి దర్శనానికి వచ్చారు. నారద మహర్షి శివుని తో స్వామి మీ పుణ్య దంపతుల నాట్యం చూడ కోరిక గా ఉంది అని కోరాడు.దానికి శివుడు మీము ఎందుకు నారద ఈ రోజు మా బదులు నందీశ్వరుడు నాట్యం చేస్తాడు,చూడుము అని చెప్పినందీశ్వరు, నితో నాట్యం చేయమని ఆజ్ఞాపించెను,శివుని ఆజ్ణ ను సారం నందీశ్వరుడు నాట్యం చేయసాగెను. సాహిత్య,లయబద్దం లేని నందీశ్వరుడు నాట్యం ని చూసి పార్వతి దేవి పగలబడి నవ్వసాగెను.అది చూసి నారద నారద మునీంద్రుడు,నందీశ్వరుని తండ్రి శిలాదుని కి చూసావా మునివర్యా,పార్వతీ దేవి నీ కుమారుడి నాట్యం చూసి పగలబడి నవ్వుతుంది అని రెచ్చగొట్టెను,దానికి కోపోద్రేకుడు అయిన శిలాదుడు పార్వతీ దేవితో తల్లీ ఎందుకు నా పుత్రుడు నాట్యం చూసి హేళన చేయుచున్నారని ప్రశ్నించగా,దానికి బదులుగా పార్వతి లయబద్దంలేని నాట్యం వింత రూపంతో చేసే నాట్యం చూసి నవ్వు వచ్చిందని,అసలు ఈనాలుగు కాళ్లతో వున్న వింత ఆకారం ను గర్భాన మోసిన నీ భార్య అసలు మనిషి నేనా?అంటూ నవ్వుతూ అడిగింది,దానికి పట్టరాని కోపంతో శిలాదుడు పరమ శివుని భార్యవన్న గర్వంతో మునీశ్వరులను వారి భార్యలను అవమానిస్తావా,అంటూ భూలోకంలో ఏశక్తులు లేకుండా మానవరూపంలో పుట్టి,12సం;ల వయస్సు లో వివాహాంకాకుండానే అకాల గర్బం ధరించి అందరి చేత నగుబాట్లు పొంది,అవమానంకు గురి అయ్యు తుదకు నీ ఇంటి వారే నిన్ను అవమానించి అగ్ని లో ఆహుతి చేయుదరని శపించెను.పార్వతి దేవి శిలాద ముని ని క్షమింపమని ప్రాధేయ పడగా, భూలోకంలో పరమనిష్టాగరిష్టుడు,శివున్ని అనునిత్యం కొలిచే యాగంటి అను కమ్మ వారి కులంలో జన్మిస్తావు,మరియు నీకన్నా ముందే కైలాసం లో కామధేనువు వారి ఇంట గోవు గా జన్మిస్తుంది.అనునిత్యం ఆకామధేనువు ను కొలువుము,ఆ గోవు పంచకం వల్లన నీకు మాయా గర్బం వస్తుంది.నీ గర్బంలో నందీశ్వరుడు సూక్ష్మరూ పం లో ఉంటాడు అని పలుకుతూ, మీ మానవ రూపం అంతంతో శాప విముక్తి కలుగుతుందని చెప్పెను.ఇదంతా చూస్తున్న శివుడు నోరెత్తకుండా మౌనంగా ఉండటం గ్రహించి,పార్వతి దేవి ఏమిటి స్వామి ఇంత జరుగుతున్నా మీరు నోరు మెదపకుండా అలా ఉన్నారు,నందీశ్వరుడు నా కుమారుడు లాంటి వాడు అతన్ని చూసి నీను నవ్వటం ఏమిటి? ఈ శాపం ఏమిటి? అని ప్రశ్నించింది.దానికి బదులుగా పరమ శివుడు మరిచితి వా పార్వతీ,గజాసుర మరణం తర్వాత నందీశ్వరుడు నీ గర్భాన జన్మించాలని వరం కోరగా,నువ్వు వరం ప్రసాదించావు. ఇప్పుడు జరిగినదంతా విష్ణుమాయ లోక కళ్యాణం కోసం నువ్వు భూ మి పై అవతరించ వలసిన సమయం ఆసన్న మయినది దిగులు చెందకు అని వారించాడు. నీకు రక్షణ గా నాగేంద్రుడు కూడా ఆగ్రామంలో వెలుస్తాడు. నందీశ్వరుడు గోమాత రూపంలో నీ గర్భాన జన్మించగానే నీకు శాప విమోచనం అని తెలిపాడు. అలా శాప ఫలం తో పార్వతీ దేవి నిదానంపాడు లో ఉన్న యాగంటి రామయ్య,సుగుణమ్మ దంపతులకు సంతాన వ్రతం ఆచరించగా 15 వ శతాబ్దంలో జన్మించెను. ఆమె కు శ్రీలక్ష్మి అని నామకరణం చేసారు. శ్రీలక్ష్మి జననం కు కి ముందే రామయ్య ఇంట కామదేనువు ఒక గోమాత కు జన్మించి ఆయన ఇంట ఉండెను. రామయ్య ఊరికి పెద్ద గా వ్యవహరించేవారు,గ్రామంలో బాగోగులు చూసేడి వా డు.ఆయనకు నలుగురు మగ సంతానం కలరు.మూర్తయ్య,వెంకయ్య,నరసయ్య,లింగయ్యలు.వారంతా శ్రీలక్ష్మి ని బాగా గారంగా చూసెడి వారు.ప్రతి రోజు శ్రీలక్ష్మి గోశాల కు వెళ్లి,కామధేనువు కు నమస్కరించి,3 ప్రదక్షినలు చేసి కామధేనువు గో పంచకం ను స్వీకరించేది.ఈ విషయం తల్లితండౄలకు తెలియదు.ఇలా 12 సం; వరకు అనునిత్యం చేసేది.ఒకరోజు ఒక ఆంబోతు,రామయ్య గోశాల పై పడి కామధేనువు తో బలవంతంగా క్రీడించింది.అదే రోజు కూడా శ్రీలక్ష్మి రోజు లాగే గోశాల కు వెళ్లి కామధేనువు కు నమస్కరించి గో పంచాగం స్వీకరించగా,ఆంబోతు వీర్యకణాలతో ఉన్న అవి శ్రీలక్ష్మి గర్భంలోకి వెళ్లి,గర్బం దాల్చేలా చేసింది. అప్పుడు శ్రీలక్ష్మి రజస్వల కూడా కాలేదు,కాని శాపపలం వలన గర్బం దాల్చించి. శ్రీలక్ష్మి శరీరంలో మార్పులు ఇంటిలో ఎవరు పరిశీలించలేదు,కాని ఒక రోజు రోజు లాగే గోశాల కు వెళ్తున్న శ్రీలక్ష్మి ని చూసి రచ్చబండ పై కూర్చున్న పెద్దలు ఆమెను గమనించి వివాహాం కూడా కాని రామయ్య గారి అమ్మాయి ఇలా చేస్తే,మిగతా వారికి గ్రామ పెద్ద అయిన ఆయన ఇక ఏమి న్యాయం చెప్తారు.అంటూ ఈ విషయం ఆయనను పిలిచి చెప్పారు.ఆయన ఇంటికి వెళ్లి శ్రీలక్ష్మి ని పరిశీలించి కోపోద్రేకు అయ్యు,తమ వంశ పరువు తీసావని ధూషించగా, శ్రీలక్ష్మి తండ్రి నేను ఏపాపం ఎరుగను.నేను ఇంక రజస్వల కూడా కాలేదు,అది మీకు తెలుసు కదా అంటూ విల విలపించి,ఇదంతా దైవ లీల అని చెప్పెను,వరు నమ్మక తమ కర్మ అంటూ విలపించసాగిరి,ఆనోటా,ఈ నోటా ఈ విషయం తెలుసుకున్న అన్నలు ని తమ పరువు తీసిందని ఆమెను అంతం చేస్తే కాని పరువు నిలబడుతుందని భావించి తమ తల్లితండ్రుల ఇంట లేని సమయంలో ఒక ఆదివారం రోజు ఆమెతో తాము పొలం కు వెళ్తున్నామని,మధ్యహ్నం భోజనం పొలానికి తీసుకురమ్మని చెప్పి వెళ్లారు. శ్రీలక్ష్మి భోజనం తయారు చేసి గోశాల కు వెళ్లి కామధేనువు కి నమస్కరించి పొలానికి బయలు దేరబోగా కామధేనువు మీ శ్రీలక్ష్మితో మీ అన్నలు నిన్ను అగ్ని దహనం చేయాలని కుట్ర చేసారు. వెళ్లకు అని బతిమాలెను,దానికి తన అన్నల మాట తాను కాదనలేనని అని చెప్పి,బయలు దేరెను,మార్గ మద్యలో నాగేంద్రుడు ప్రత్యక్ష్యమయ్యు పొలానికి వెల్లవద్దని శ్రీలక్ష్మితో వారించెను, కాని వినక పొలానికి బయలు దేరెను.అన్నలలొ చిన్న అన్న అయిన లింగయ్య తన అన్నలు మాటలు ద్వారా ని అంతం చేయుచున్నారని అర్ధమయ్యి,అన్నలారా, శ్రీలక్ష్మికి గర్బం దైవ లీల అని ఆమెను ఏమి చేయవద్దని వారించాడు,దానికి మిగతా ముగ్గురు శ్రీలక్ష్మిని ఏమి చేయమని నీవు బావి కి వెల్లి నీరు తెమ్మని పంపారు,ఇంతలో పొలానికి భోజనం తెచ్చించి అన్నలు పత్తి కట్టే వేస్తున్నారు. తన అన్నలకు కామదేనువు,నాగరాజుల మాటలు చెప్పెను,వారు అవి నమ్మలేదు.ని నువ్వు పత్తి మండే పైకి ఎక్కు మీము అందిస్తాము అంటూ పైకి ఎక్కించారు.ఆమె పైకి ఎక్కగానే చుట్టు మంటలు పెట్టారు. అన్నలారా నీను ఏ పాపం ఎరుగను నన్ను ఇలా దహనం చేయటం మీకు భావ్యమా,అంటూ విలపిస్తూ అగ్ని కి ఆహుతి అయ్యింది. నాగరాజు కూడా అక్కడకు వచ్చి అగ్నిలో దూకి శ్రీలక్ష్మీ తో పాటు దహనంఅయ్యాడు. అగ్ని కీలక దహనంతో గర్బం నాలుగు ముక్కలు గా చీలి నాలుగు కాళ్లతో శిరస్సు మీద మచ్చతో ఒక కోడె దూడ మరణించి భూమి పై పడినది.ఈ దృశ్యం చూసిన అన్నలు తమ నేత్ర దృష్టి కోల్పోయారు.గోశాల లొ కామదేనువు తాడు తెంపుకుని ఆ ప్రదేశం కి వచ్చి అంబా,అంబా అంటూ అరుస్తూ అగ్ని లో దూకి తాను ఆహుతి అయ్యింది,అరుపులు విని పరిగెత్తుకొచ్చిన లింగయ్య భాదతొ ఏడుస్తూ ఎంత పని చేసారు అన్నలారా అంటూపెద్దగా రోదించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశం కు చేరారు మిట్టమధ్యనం 12 గం; మిట్టమధ్యనం సమయంలో భీకర శబ్దంతో భూమి బారెడు వైశాల్యంతో భూమి చీలి సువర్ణ విగ్రహం వెలుగులతో వెలసింది. అప్పుడు శ్రీ లక్ష్మీ అమ్మవా రు ఓ గ్రామ ప్రజలారా నీను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను వారికి ఈ విషయం తెలియక దహనం చేసారు.ఆదివారం నన్ను దహనంచేసారు కావున ప్రతి ఆదివారం నాకు పసుప,కుంకుమ తొ పూజించండి.నన్ను దహనం చేసిన అన్నల వంశం నాశన మయ్యు ఒక్క లింగయ్య వంశం మాత్రం వర్ధిల్లితుంది అని చెప్పి,భూమిలోకి సువర్ణ శిలా విగ్రహం భూమి లొకి వెళ్లిపోతూ నకు ఎటువంటి రూపం కల్పించరాదని,నన్ను మండుటెండలో అగ్ని దహనం చేసినంద్దున నాకు ఆలయం కట్టవద్దని,నన్ను ఎండలో ఉండే భక్తులు దర్శించుకోవాలని,నీను ఇక్కడ భూగర్బంలో నిదానం పాటి అమ్మవారి గా యజ్ఞ నిక్షిప్తమ య్యు ఉంటానన్ని నన్ను బయటకు తీయ ప్రయత్నించ వద్దని హెచ్చరించి,తనతో పాటు అగ్ని కి ఆహుతు అయిన కామదేనువు ను మూడు పసుపు ముద్దలు గా చేసిమిరియాల గ్రామస్తుల అయిన బత్తుల వంశం కు చెందిన యాదవ కులస్తులకు ఇలవేల్పుగా,ఆవుదేవర అను నామం న కొలమనని మిరియాలకు పంపెను,ప్రతి సం; మిరియాల లో నేటికి ఉత్సవాలు 5 రోజు లు చేస్తారు.ఆవుల పబ్బం గా గొప్ప ఉత్సవం చేస్తారు. నన్ను భక్తితో కొలిచేవారిని స్వప్నమందు కనిపించి వారి కోర్కెలు తీరుస్తానాని,నా మహామంత్రం జయజయ లక్ష్మి నిదానంపాటి శ్రీలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తాను. అని చెప్పి, సువర్ణ శిలా విగ్రహం భూమి లొకి వెళ్లిపోతూ తన అన్నలకు నేత్ర దృష్టి ప్రసాదించింది. అప్పటి నుండి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ గా ఆ ప్రదేశంలో పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగుబంగారం గా నిలిచించి.పాల్గుణ పొర్ణమి కి దగ్గరగా ఉండే ఆదివారం ప్రతి సం; ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.మెదట గా తన పుట్టింటి యాగంటి వారి కుంకుమ బండి ప్రభ వస్తుంది,అనేక గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తారు.ప్రతి ఆదివారం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంతారు.ఇప్పటికి అమ్మవారికి రూపం ఉండదు . మహిమలు అన్ని చోట్ల కు విస్తరించి అన్ని ప్రాంతాల భక్తులు విపరీతంగా నిదానంపాడు శ్రీ లక్ష్మీ అమ్మవారి ని దర్శిస్తున్నారు.సంతానంలేని వారు ఈ తల్లి ని దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది.కొత్త వాహానాలు కొన్నవారు ఈ తల్లి ని దర్శించి వాహానానికి పూజలు చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్తారు. ప్రశాంత అటవీ వాతావరణం చూడ చక్క గా ఉంటుంధి.అద్బుత మహిమలు కలిగిన నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ని తప్పక దర్శించండి.ఇటువంటి మహిమ కలిగిన దేవత మన పల్నాడు ప్రాంతంలో వెలవటం మన అదృష్టం.

రచయిత వేముల శ్రీనివాసరావు మాచర్ల

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *