Home / Tourism Places / Macharla / శ్రీ మల్లికార్జున భ్రమరాంభికా దేవాలయం

శ్రీ మల్లికార్జున భ్రమరాంభికా దేవాలయం

రెంట చింతల మండలంలో జెట్టిపాలెం గ్రామంలో ఉన్న ప్రసిద్ద శ్రీ మల్లికార్జున భ్రమరాంభికా దేవాలయం గురించితెలుసుకుందాం. ద్వాపర యుగం నుండి ఈ ఆలయం ఉన్నట్లు ఆధారాలున్నాయి. పూర్వ కాలంలో విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేసుకుంటుండగా. కాకులు రూపంలో కాకాసురుడు అనే రాక్షసుడు తపస్సు కు భంగం చేయుచుండగా అయోధ్యకి పోయి రామ,లక్ష్మణుల సహాయం కోరతాడు.వారు అక్కడకి వచ్చి రాక్షసుడుని చంపుతారు. తరువాత విశ్వామిత్రుడు ఇక్కడ శివలింగం ప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మించారని చెపుతారు. కాకులు,పిదప ఆయన ఈ ప్రాంతంలో కాకులు తిరగరాదు అని శాపం పెట్టాడు.నేటికి ఆ ప్రాంతంలో కాకులు తిరగక పోవటం విశేషం.అలాగే శ్రీరాముడు ఈ ప్రాంతంలో తన విల్లు,అంబులను ఒక చెట్టు పై దాచాడని లంక పై యుద్దానికి వెళ్లేటప్పుడు మరలా ఆయుధాలు తీసుకున్న మహిమాన్విత స్తలంగా చెపుతారు ఇప్పుడున్న నది నీరు లో రామ పాద గుర్తులుఉన్నట్లు ఆ గుర్తు నుండి ప్రతి నిండు పౌర్ణమి రోజు నాగేంద్ర స్వామి వచ్చి శివలింగం ను చుట్టు కుంటుందని పెద్దలు చెపుతారు… ఆలయం పక్కనే ప్రవహించే కృష్ణానది పరవళ్లు చూడ చక్కగా ఉంటుంది.ఈ ఆలయ ప్రాంగంణంలో శిల్పసంపద అద్బుతం గా ఉంటాయి.పురాతన నాగ శాసనాలు ఇక్కడ చాలా కనిపిస్తాయి.. అతి ప్రశాంత మయిన వాతావరణం,రమణీయ శిల్ప సంపద భక్తులను ఆకట్టుకుంటాయి.శివుడు భోళా శంకరుడు కనుక కోరిన కోర్కెలుతీర్చుతాడని ఈ దేవాలయాన్ని సందర్శించిన వారికిసుఖశాంతులు,ఆయురారోగ్యాలు కలుగు తాయని భక్తుల నమ్మకం. శివరాత్రి సమయంలో ఇక్కడ కు అధిక సంఖ్య లో భక్తులు వస్తారు. అతి పురాతన్ చారిత్రక సంపద కలిగినఈ దేవాలయం ను దర్శించని వారు తప్పక దర్శించండి.మన పల్నాడు ప్రాంతం చరిత్ర కు,పురాతన ఆలయాల కు పెట్టింది పేరు.అటువంటి పల్నాటి సీమ లో పుట్టిన మనం మన చరిత్ర తెలుసుకోవాలి,ఇతరులకు పంచాలి.

రచయిత వేముల శ్రీనివాసరావు మాచర్ల

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *