Home / Tourism Places / అనుపు

అనుపు

మాచర్ల కు 15 కి.మీ మరియు నాగార్జున సాగర్ కు 10 కి.మీ లో గల అనుపు యొక్క సుందర ప్రాంతం గురించి తెలుసుకుందాం.పచ్చని తివాచీ పరిచినట్లుఉండే పచ్చని గడ్డి, మనోహర మైన పార్కులు,కనువిందు చూసే కృష్ణానది నీరు, చారిత్రక కట్టడాలు కనువిందు చేస్తాయి.

పురాతన కాలం నుండే అనుపు లో చరిత్ర మొదలయింది.

బౌధ్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో ఇచ్చటకు వచ్చి ఒక విశ్వ విద్యాలయాన్ని నిర్మించాడు. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్తులు ఇక్కడికి వచ్చి విద్య నబ్యసించారని చారిత్రికాదారాలున్నాయి.

సాగర గర్బంలో వుండిన ఆనాటి విశ్వ విద్యాలయ శిధిలాలను యదా తదంగా తరలించి నాగార్జున కొండ పైన మ్యూజియంలోను, ఆరుబటయ కూడ భద్ర పరచి సందర్శకులు చూడ డానికి ఏర్పాటు చేశారు. అనుపు అనే ప్రాంతం సాగర్ ముంపునకు గురికాలేదు. కనుక అక్కడ వున్న ఆనాటి కట్టడాలు ఎక్కడ వున్నవి అక్కడనే భద్రపరచి జాగ్రత్త తీసుకుంటున్నారు భారత పురావస్తు శాఖ వారు.

 

ఈ విషమై పరిశోధన చేసే వారికిది అమూల్యమైన ప్రదేశము:

అనుపు నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపున సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్నది. ఇక్ష్వాకుల రాజధాని ప్రాంతం లోని ప్రదేశం కాబట్టి ఇక్కడ అప్పట్లోనే రాజులు ఇక్కడ క్రీడా ప్రాంగణం నిర్మించారు. ఆరోజుల్లో వారు అక్కడ వారి సాంప్రాదాయ క్రీడలు ఆడేవారు.ప్రేక్షకులు కు అందరికి కనపడేలా ఈ కట్టడం నిర్మించటం ఆనాటి వైజ్ఞానిక సంపదకు నిదర్శనంఆకట్టడం మనకు కనువిందు చేస్తుంది.

విదేశాల విధ్యార్దులుటిబెట్,చైనా,మంగోలియా విధ్యార్దులు ఇక్కడకు వచ్చి ఆచార్య నాగార్జునుడు స్తాపించిన నాగార్జున విశ్వవిధ్యాలయం లో చదువుకునేవారు. ఇప్పటికి మనకు అక్కడ భౌద్ద అవశేషాలు కనపడుతుంటాయి. అనుపు నీరు మనకు బీచ్ వాతావరణం ను గుర్తు చేస్తుంది.నీరు ముందుకు వచ్చి వెనుకకు పోతూ వుంటుంది.
పెద్దవారు కూడా చిన్నపిల్లలా ఆడుకుంటారు. అనుపుఅందం చూసి,ఇక పిల్లలుఅయితే ఆప్రదేశం నుండి రాము ఇంకా వుందాం అని మారాం చేస్తారు.
కాళ్ల కిందుగా వచ్చి,పోయే నీళ్ళు ఆహ్లాద వాతావరణం రమణీయ ప్రకృతి చూడవలసిందే కాని,వర్ణించలేము. ఈ సుందర ప్రదేశం లో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు.ఘర్షణ వెంకటేష్ మూవి లో కాటేజ్ ఈ ప్రాంతంలోనె సెట్ వేసారు.ఒక్క సారి ఈ ప్రాంతం చూస్తే వందల సార్లు వెల్లి చూస్తాము.

రచయిత వేముల శ్రీనివాసరావు మాచర్ల

 

 

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *