Home / News / పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, వాహనాలు, వేలాది మంది ప్రజలు, ప్రసంగాలకు ఊహించని స్పందనతో పల్నాటిగడ్డపైన అలనాటి అన్నగారి టూరును తలపించింది లోకేష్‌ పర్యటన. ఫుల్ మార్కులు పడ్డాయి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శీనన్నకు. పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సందర్భంలో ఆలస్యమైనందుకు ఫీల్‌ కావద్దొని ఎమ్మెల్యే యరపతినేని, లోకేష్‌తో అనటం జరిగింది.

అందుకు స్పందించిన లోకేష్‌ ‘‘భలే వాడివన్నా… ఇంత పెద్ద ప్రోగ్రామ్‌ చేశావని నేను చాలా సంతోషిస్తున్నా… ఒకే రోజు నాలుగు మీటింగ్‌లకు అంతమంది ఎలా వచ్చారో నాకే అర్థం కావటం లేదు.. చాలా హ్యాపీగా ఫీలయ్యా.. థ్యాంక్స్‌’’ అంటూ యరపతినేనిని హత్తుకోవటం జరిగింది. ఎందుకు అంత ఖుస్‌ అయ్యారంటే పల్నాడులో నారా లోకేష్‌కు బ్రహ్మరథం అంటే ఏంటో అక్కడ చూపించాడు. దాంతో లోకేష్‌ కూడా వాడివేడి మాటలతో ప్రతిపక్షాలను దునుమాడి దడదడ లాడించాడు. పల్నాడు వేదికగా ఎన్నికల శంఖారా వం పూరించిన లోకేష్‌ గ్రామాలలో నిలిచి పోయిన అభివృద్ధిపనులు పూర్తి కావా లంటే టీడీపీ మళ్లీ అధికారంలోకి రావా లని పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం కు టుంబాన్ని కూడా వదులుకొని అహర్నిశ లు పాటుపడుతున్న చంద్రబాబును ఓటుతో దీవించాలని పిలుపునిచ్చారు. వెను కబడిన ప్రాంతాలకు తాము వెన్నుదన్ను గా నిలిచామన్న విషయాన్ని పదే పదే స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా ప నిచేస్తున్నారో వివరించిన లోకేష్‌ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల పనితీరును ఎండ గట్టారు.

తాను మంత్రినై 19నెలలు గడు స్తున్నా ఒక్క వైసీపీ ఎమె ల్యే కూడా ఏ పని నిమిత్తం తన వద్దకు రాలేదని బహిరంగంగా చెప్పటం ద్వారా ప్రతిపక్ష నేతల పనితీరు పేలవమని తేల్చేశారు. మైనింగ్‌ విషయంలో వేరే నియోజక వర్గాలకు చెందిన నాయకులు గురజాల వచ్చి యరపతినేని శ్రీనివాసరావుపై చే స్తున్న విమర్శలపై లోకేష్‌ అనూహ్యరీతి లో స్పందించారు. ఆయా నేతలు వారి సత్తా ఏమిటో వారి స్వంత నియోజకవ ర్గాల్లో చూపించుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయటం చేతకానివారు శ్రీనన్న మీద వి మర్శలు చేసేవారా అని ఎదురుదాడి చేశారు. మొత్తం మీద పల్నాడు పర్యటన తో లోకేష్‌ 2019 ఎన్నికలకు జిల్లా నాయకత్వాన్ని అప్రమత్తం చేసినట్లైంది.

ఆత్మగౌరవ యాత్ర నుం చి ఏ కార్యక్రమాన్నైనా గురజాల నుంచే ప్రారంభించటం సెంటిమెంట్‌గా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం పూరించిందా!? శుక్రవారం గురజాల లో జరిగిన లోకేష్‌ పర్యటన ను ఆద్యంతం పరిశీలిస్తే అదే నిజమనిపిస్తోంది. మూడు నెలల వ్యవధిలో రెండోసారి పల్నాడుకు వచ్చిన నారా లోకేష్‌బాబు ఆ విషయాన్ని ప్రసంగాల ద్వారా చెప్పకనే చె ప్పారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు నేతృత్వంలో మాడుగుల నుంచి పిడుగురాళ్ల వరకు జరిగిన భారీ బహిరంగ సభల్లో లోకేష్‌ మాటలకు పదునుపెట్టారు.

జాతీయ, రాష్ట్ర రాజకీయ వ్యతి రేకులను ఘాటుగా విమర్శించారు. ఒక వైపు తమ ప్రభుత్వ హయాంలో ఏం చే శారో చెప్తూనే, మరోవైపు ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు. జగన్‌, పవన్‌, మోడీతో చేతులు కలిపి రాష్ర్టాన్ని పాడుచేయాలని చూస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అన్ని సభల్లోనూ ఓటేసి మళ్లీ అధికారం కట్టబెట్టాలని అర్ధి స్తూనే, ఓటు అనే ఆయుధం ద్వారా బీజే పీని, మోదీని దేశం నుంచి పారద్రో లుదామంటూ పిలుపునిచ్చారు. హోదా ఇవ్వకుండా వంచించిన మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా, గుజరాత్‌కు ముఖ్య మంత్రిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రజ ల్లో భావోద్వేగాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. హోదా, విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కుఫ్యాక్టరీ వంటివి రాకుండా అడ్డుప డిన బీజేపీ అడుగులకు జగన్‌, పవన్‌ మ డుగులొత్తుతున్నారంటే వీరిని ఏ విధం గా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై వస్తు న్న వ్యక్తిగత విమర్శలకు కూడా లోకేష్‌ పల్నాడు వేదికగా ఘాటుగా స్పందిం చా రు. పవన్‌కు దమ్ము ధైర్యం ఉంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలను ప్రజా కో ర్టులో పెట్టాలని సవాలు విసరటం ద్వా రా లోకేష్‌ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *