Home / News / ఏపీలో ఉపఎన్నికలు జరిగితే ఏమయ్యేది..?

ఏపీలో ఉపఎన్నికలు జరిగితే ఏమయ్యేది..?

కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కర్ణాటకలో మూడు పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. అసెంబ్లీ స్థానాల సంగతేమో కానీ.. ఆరు నెలల పదవి కాలం మాత్రమే ఉన్న పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటనేది ఎవరికీ అర్థం కాలేదు. అదే సమయంలో ఏపీలో ఐదు లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉంటే సాంకేతిక కారణాలు చెప్పి.. షెడ్యూల్ ప్రకటించలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా..పార్లమెంట్ సభ్యులకు ఆరు నెలలో పదవీ కాలం. ఉపఎన్నికలు వస్తాయేమోనని.. వైసీపీ సభ్యులు టెన్షన్ పడ్డారు. రాకపోయే సరికి.. ఆనందపడ్డారు. ఫలితాలు చూసి మరీ ఆనంద పడుతున్నారు.

ఉపఎన్నికల్లో సులువుగా గెలిచేస్తామని.. కాంగ్రెస్, జేడీఎస్ కొట్టుకుంటాయని.. ఆ ప్రభావం పోలింగ్ పై పడుతుందని బీజేపీ ఆశించింది. కాంగ్రెస్, జేడీఎస్ కలహించుకోలేదు. పద్దతిగా సీట్లు పంచుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. కాంగ్రెస్, జేడీఎస్ సంయుక్త ప్రకటన చేశాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూటమిగా బీజేపీని కూలదోస్తామని ప్రకటించాయి. అంటే.. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తును విచ్చిన్నం చేద్దామనుకున్న బీజేపీ.. పని గట్టుకుని వారిని బలోపేతం చేసినట్లయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి.. కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు .. ఓ బూస్ట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే… తెలంగాణలో కూడా.. కాంగ్రెస్ పార్టీ.. ఇతర పార్టీలను కలుపుకుని కూటమిగా పోరాడుతోంది. ఈ దెబ్బకు..తెలంగాణలో కూడా.. పరిస్థితులు మారిపోతాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే.. ఈ ఫలితాలపై టీఆర్ఎస్ కూడా నోరుమెదపలేదు.

కర్ణాటక ఫలితాలు చూసి.. మాజీ ఎంపీలయిన.. వైసీపీనేతలు… సంతోషపడ్డారు. వైసీపీ అధినేత బాధపడినా.. ఉపఎన్నికలు తప్పించుకున్నందు.. గంతులేశారు. ఆరు నెలలకు ముందు పదవి పోగొట్టుకుని..మళ్లీ ఓడిపోయి.. ఉన్నదంతా ఊడ్చేసుకున్నట్లు అవుతుందని… తెగ ఫీలయ్యేవారు. ఇప్పుడు తప్పించుకున్నందుకు హాయిగా ఉంటున్నారు. ఈ విషయంలో.. వైసీపీ అధినేతది ఓ బాధ అయితే… ఉపఎన్నికలు తప్పించుకున్న… నేతలతో సంతోషం. వైసీపీ పరిస్థితి అలా ఉంది మరి..!

 

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *