Home / Politics / తెలంగాణలో పోటీచేసే టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే?

తెలంగాణలో పోటీచేసే టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇక గులాబీ బాస్ బహిరంగ సభలపై దృష్టి పెట్టారు. కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక హరీష్ రావు ప్రచారంలో అందరికంటే ముందున్నారు. ఇలా కారు పార్టీ నాయకులంతా ప్రచారంలో రుయ్యిన దూసుకుపోతుంటే ఇతర పార్టీలు మాత్రం పొత్తల లెక్కలపైనే ఇంకా కాలం వెల్లదీస్తున్నాయి. ఇక అభ్యర్థుల ఖరారుపై కూడా మల్లగుల్లాలు పడుతున్నాయి. ఒకరికి టికెట్ కేటాయిస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ మారుతామంటూ సంకేతాలు పంపుతున్నారు. ఒకరికిచ్చి మరొకరిని బుజ్జగించే పనుల్లో పార్టీలు బిజీ అయిపోయాయి. ఇక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు ఒక్క తాటిపైకొచ్చాయి. ముగ్గురు కలిసి టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పొత్తులు కూడా కుదుర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. అయితే సీట్ల సర్దుబాటు ఎలాగుంటుందో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా బయటకు వస్తే కానీ చెప్పలేం. ఇప్పటికే కమిటీల జాబితాలో తమ పేర్లు లేవంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీలో సీనియర్ నేత వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌లాంటి వ్యక్తుల పేర్లు కనిపించకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజగోపాల్ రెడ్డి ఏకంగా కుంతియానే టార్గెట్ చేశారు. మరి ఇలాంటి సమయంలో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది ఎవరికి చెక్ పెడుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలోనే కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తానికి గుడ్‌బై చెప్పి తమ దారి తాము వెతుక్కునేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
Telangana TDP MLA contesting candidates list out?
ఇక టీడీపీ విషయానికొస్తే వారు పెద్దగా గందరగోళానికి గురికావాల్సిన పని కూడా లేకుండా పోయింది. కాంగ్రెస్‌తో పొత్తుకే ఆపార్టీ మొగ్గుచూపుతోంది.పైగా వారి అభ్యర్థుల సెలెక్షన్ కూడా పెద్దగా కష్టంగా లేకుండానే అయిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉన్న చోట టీడీపీ అభ్యర్థిని బరిలో పెట్టడంలేదు. అలానే టీడీపీ అభ్యర్థి బలంగా ఉన్న చోట కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలిపదు అన్నట్లుగా సమాచారం. ఇక వీటన్నిటికీ తెరదించుతూ టీఆర్ఎస్ పార్టీ తర్వాత తమ అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ విడుదల చేసింది. మొత్తం 19 స్థానాలకు తమ అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసినట్లుగా సమాచారం. నియోజకవర్గాల వారీగా వారిపేర్లు ఇలా ఉండే అవకాశం ఉంది.

శేరిలింగంపల్లి – మొవ్వ సత్యనారాయణ

కూకట్‌పల్లి- మందాడి శ్రీనివాసరావు

సికింద్రాబాద్ -కూనవెంకటేష్‌గౌడ్

ఉప్పల్- వీరేందర్‌గౌడ్

ఖైరతాబాద్ -బి.ఎన్.రెడ్డి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ – శ్రీనివాసరావు

రాజేంద్రనగర్-ఎమ్ భూపాల్‌రెడ్డి

సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య

సిట్టింగ్ ఎమ్మెల్యే ఖమ్మం – నామా నాగేశ్వరరావు

మిర్యాలగూడ -శ్రీనివాస్

కోదాడ – బొల్లం మల్లయ్యయాదవ్

ఆలేరు – శోభారాణి

పరకాల-రేవూరి ప్రకాష్‌రెడ్డి

ఆర్మూర్ – ఏలేటి అన్నపూర్ణ

హుజూరాబాద్ – ఇనగాల పెద్దిరెడ్డి

దేవరకద్ర – రావుల చంద్రశేఖర్‌రెడ్డి

మహబూబ్‌నగర్- చంద్రశేఖర్

మక్తల్ – కొత్తకోట దయాకర్‌‌రెడ్డి

 

 

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *