Home / Politics / ఆరుగురా…? ఏడుగురా…? టీడీపీ సీట్లు గ‌ల్లంత‌య్యేవారి లెక్క‌ ఇదే..?

ఆరుగురా…? ఏడుగురా…? టీడీపీ సీట్లు గ‌ల్లంత‌య్యేవారి లెక్క‌ ఇదే..?

మ‌రో ఆరేడు నెల‌ల్లో ఎన్నిక‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు జిల్లాల వారీగా ప‌ర్య‌ట‌నలు మొద‌లు పెట్టారు. ఆ ప‌ర్య‌ట‌న‌ల్లోనే ప్ర‌స్తుత ఎమ్మెల్యేల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు… వ‌చ్చే ఎన్నిక‌ల‌లో వారి ప‌రిస్థితి ఇవ‌న్నీ ప‌రిశీలిస్తూ చంద్ర‌బాబు ఒక‌ అంచ‌నాకు వ‌స్తున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలో రెండు రోజులు మ‌కాం వేసి మొత్తం సెట్ చేశారు. అక్క‌డి నేత‌ల్లో నెల‌కొన్న విభేదాలు, అసంతృప్తుల‌ను గ‌మ‌నించి వారిని దారిలోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అంద‌రు క‌లిసిక‌ట్టుగా ఉండి ప‌నిచేస్తేనే ఈ సారి సీటు లేకుంటే మీ ఇష్టం అని తేల్చి చెప్పిన చంద్ర‌బాబు బాల్ వాళ్ల కోర్టునే వేసి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే మిగిలిన జిల్లాల్లోని టీడీపీ నేత‌లు, ఎమ్మెల్యేల్లో గుబులు మొద‌లైంది. 80 శాతం సంతృప్తి నా ల‌క్ష్యం… రాష్ట్ర స్థాయిలో పార్టీపై ప్ర‌జ‌ల్లో సంతృప్తి 85 శాతం చేరింది. క్షేత్ర స్థాయిలో, ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గాల‌లో మాత్రం ఇంకా కొంత అసంతృప్తి ఉంది. దానికి ప్ర‌ధాన కార‌ణం నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎమ్మెల్యేల ప‌నితీరే కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు గుర్తించారు. అందుకే దానిని సెట్ చేసే ప‌ని మొద‌లుపెట్టారు.

ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఎమ్మెల్యేల్లో, నేతల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. రాష్ట్రంలో అధికారానికి రావాలంటే గోదావ‌రి జిల్లాలో ప‌ట్టు సాధించాల్సిందే. అందుకే ఈ జిల్లాల‌పై చంద్ర‌బాబు కూడా ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. అత్యంత కీలక జిల్లాల్లో ఒకటైన పశ్చిమ‌గోదావ‌రిలో అంతర్గతంగా పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే నిర్వహించిన సర్వేల్లో ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేనట్టు తేలింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి శాతం అత్యధికంగా కనిపించినా సీఎం చంద్రబాబుపై సానుకూలత చెక్కు చెదరకపోవడాన్ని గుర్తించారు. సమయం దగ్గర పడుతున్నా ఇంకా పట్టనట్టుగా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాంతో ఈ జిల్లాలో సరాసరిన ఆరు నుంచి ఏడు వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో మార్పులు ఉంటాయని ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. అయినా ఎవరంతట వారు తమ సీటు పదిలమే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. లోలోన ‘మార్కులు’ తగ్గిన వైనాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇప్ప‌టికే నియోజకవర్గాల వారీగా పార్టీ, ప్రభుత్వ పథకాల తీరుపై ఒక అంచనాకు వచ్చేందుకు అంతర్గత నివేదికలు ప్రభుత్వం చేతికి అందాయి. లోటుపాట్లపై నివేదికలో స్పష్టంగా ఉన్నట్టు సమాచారం. దీని ప్రకారమే దాదాపు అర డజను నియోజకవర్గాల్లో ప్రజల సంతృప్తి ఆశాజనకంగా లేదనే విషయం తేలింది. ఇదే తరుణంలో సమస్యలను పరిష్కరించగలిగితే తిరిగి ప్రజామోదం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఒక అంచనాకు వచ్చారు.

పార్టీపరంగా ఉన్న అసంతృప్తివాదులను గుర్తించి ఆ మేరకు ముందస్తుగా జాగ్రత్తపడాలనే ఆలోచన వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్టుగానే వైసీపీ, బీజేపీ, జనసేన కదలికలపై పూర్తిగా దృష్టి సారించి టీడీపీ ఆ పార్టీల వ్యూహాలను తల్లకిందులు చేసే విధంగా కొత్త వ్యూహాలు సిద్ధం కావాలని ఆలోచనకు పదును పెట్టబోతున్నారు. మంత్రులు జవహర్‌, పితాని సత్యనారాయణలకు తాజాగా మరికొన్ని బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. ఈ ఇద్దరు మంత్రులు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా జిల్లాలో చురుకైన పాత్ర పోషించేలా బాధ్యలు ఉండబోతున్నాయని ఒక అంచనా. ఏదేమైనా జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలను మార్చ‌డం ఖాయమ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం టీడీపీ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *