Home / Politics / టిడిపి నేతలు ‘సుజనాచౌదరి’ కి మద్దతు ఇవ్వడం లేదా…!?

టిడిపి నేతలు ‘సుజనాచౌదరి’ కి మద్దతు ఇవ్వడం లేదా…!?

పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..’సుజనాచౌదరి’ పార్టీ మొత్తాన్ని భుజాన వేసుకుని మోశాడు. పార్టీకి ఏ అవసరాలు ఉన్నా..ఆయన ఉన్నాడనే ధీమా అధినేత ‘చంద్రబాబు’లో ఉండేది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలను ఎదుర్కొని ఒకసారి ఓడిపోయినా..ఆయన వెనుకంజ వేయలేదు. పార్టీకి కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తూనే ఉన్నారు. మరోసారి కూడా ఓడిపోతుందని ప్రచారం జరిగినా…ఆయన వెన్నుచూపలేదు. పోరాట పంథాను ఎంచుకుని..జిల్లాల వారీగా పర్యటిస్తూ..పార్టీని పటిష్టం చేస్తూ..అధినేతకు వెన్నుదన్నుగా ఉండి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు పోరాడి ఫలితాలు సాధించారు. అటువంటి నేతకు ఇప్పుడు కష్టాలు వచ్చాయి. అదీ ఆయన స్వంతంగా తీసుకున్న నిర్ణయం వల్ల కాదు..పార్టీ తీసుకున్న వైఖరి వల్ల కేంద్ర పెద్దలు ఆయనపై కక్షకట్టి వేధిస్తున్నారు.

టిడిపిని వీడి..తమ పార్టీలోకి రావాలన్న వారి అభ్యర్థనను తిరస్కరించారనే కారణంతో__ఆయనపై ఐటి,ఇడి దాడులు చేయిస్తూ ఉక్కిరిబిక్కిరి చేయిస్తున్నారు. అయినా ఆయన వెరవడం లేదు. అయితే..కష్టాల్లో పార్టీ ఉన్నప్పుడు ఆదుకున్న ఆ నేత ఇప్పుడు కష్టాల్లో ఉంటే..పార్టీ నుంచి పెద్దగా స్పందన రావడం లేదనే మాట వినిపిస్తోంది. ఆయన ఇంటిపై ఐటి దాడులు జరిగితే..దాని గురించి పార్టీనేతలు పెద్దగా మాట్లాడడం లేదు. చోటా మోటా నాయకులు ఖండనలతో సరిపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు మాట వరస కోసమైనా ఖండనలు చేయడం లేదు. అధినేత చంద్రబాబు మాత్రం సహచరుడ్ని కాపాడుకోవాలనే తాపత్రయంతో ఉన్నారు. ఆయన స్పందిస్తున్నా..ఇతర నేతలు మాత్రం అనుకున్న రీతిలో స్పందించడం లేదు.

Image result for sujana chowdary

ఇది పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. మొన్నటి దాకా..టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలపై ఐటి దాడులు జరిగితే..టిడిపి నేతలంతా జట్టుగా..ఒకేసారి ఖండనలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ‘సుజనాచౌదరి’ వ్యవహారంలో ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని..పార్టీ నేతలే కొందరు అంటున్నారు. గత కొన్నాళ్లుగా..చంద్రబాబుకు ‘సుజనా’కు మధ్య గ్యాప్‌ పెరిగిందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ‘సుజనా’కు ‘చంద్రబాబు’ ప్రాధాన్యత ఇవ్వడం లేదనే మాట పార్టీ వర్గాల్లో గత కొన్నాళ్లుగా ఉంది. దీంతో..పార్టీ నేతలు కూడా ఆయనకు దూరం జరుగుతున్నారు. మరో వైపు ‘చంద్రబాబు’ కుమారుడు ‘లోకేష్‌’కు ‘సుజనా’కు మధ్య గొడవలు ఉన్నాయని దాంతో..’సుజనా’ ‘చంద్రబాబు’కు దూరంగా జరుగుతున్నారనే మాట కూడా ఉంది. అయితే వారి మధ్య విభేదాలు ఎలా ఉన్నా..సహచరుడు కష్టాల్లో ఉన్నప్పుడు..పార్టీ నేతలంతా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన పార్టీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.

టిడిపికి మద్దతు ఇస్తున్న పత్రిక వ్యవహరించిన తీరు కూడా తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఆ పత్రిక అధినేతకు ‘సుజనా’కు ఉన్న గొడవలతో నిన్న ఐటి అధికారులు ప్రకటించిన ప్రకటనలను బ్యానర్‌ చేసి ఆ పత్రిక పార్టీ పరువును కూడా తీసిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అధికారపార్టీకి మద్దతు ఇచ్చే పత్రికే ఆయన అవినీతి విలువ ఇంత..? అంటూ రాయడంపై పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఆయన చేసిన అవినీతి, అప్పుల వ్యవహారాల గురించి పార్టీకి ఎందుకని, ఆయనను సమర్థించాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏ వ్యాపారి అయినా అప్పులు లేకుండా వ్యాపారాలు చేయలేరని, అదీ ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు తెచ్చి.. కావాలని అల్లరి చేస్తుంటే..మనం మద్దతుఇవ్వకపోతే ఎలా అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘సుజనా’ ఏ వ్యాపారాలు చేసినా, ఇతర అవకతవకలు ఏమి చేసినా..పార్టీ కోసం నిబద్దతతో పనిచేశారు..అటువంటి వ్యక్తిపై దాడి జరుగుతుంటే__;పార్టీ నాయకులు చోద్యం చూడడం..సరికాదనే వాదన ఎక్కువమంది నుంచి వినిపిస్తోంది.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *