Home / Politics / తెలంగాణ లో బీజేపీకి షాక్ మీద షాక్ లు…!!!! విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..???

తెలంగాణ లో బీజేపీకి షాక్ మీద షాక్ లు…!!!! విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..???

ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఆయా పార్టీలు ఓట్ల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు సామ, దాన, భేద దండోపాయాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ పట్టున్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా పటిష్ఠం చేసుకున్న బూత్‌ కమిటీలను ప్రత్యర్థి పార్టీలు చెల్లాచెదురు చేస్తున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో పట్టున్న నేతలతోపాటు బస్తీ నాయకులు, పోలింగ్‌ ఏజెంట్లకు గాలం వేస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి బీజేపీ నుంచి అధికంగా వలసలు ఇతర పార్టీలకు మొదలయ్యాయి. ప్రచారంలో వెన్నంటే తిరిగిన నేతలు, కార్యకర్తలు రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయిస్తుండడంతో పలు నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు.

ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఆయా పార్టీలు ఓట్ల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు సామ, దాన, భేద దండోపాయాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ పట్టున్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా పటిష్ఠం చేసుకున్న బూత్‌ కమిటీలను ప్రత్యర్థి పార్టీలు చెల్లాచెదురు చేస్తున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో పట్టున్న నేతలతోపాటు బస్తీ నాయకులు, పోలింగ్‌ ఏజెంట్లకు గాలం వేస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి బీజేపీ నుంచి అధికంగా వలసలు ఇతర పార్టీలకు మొదలయ్యాయి. ప్రచారంలో వెన్నంటే తిరిగిన నేతలు, కార్యకర్తలు రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయిస్తుండడంతో పలు నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు.

 

Image result for bjp membership

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపి బీజేపీ ప్రచారాన్ని పెంచింది. బీజేపీ నేత, పీఠాధిపతి పరిపూర్ణనందస్వామి నగరంలో అన్నీ తానై రోడ్‌షోలను చేపట్టి ఓ వర్గం ఓట్లను ఆకర్షించే విధంగా ఉపన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. రేపో, మాపో మరింత మంది స్టార్‌ క్యాంపెయినర్లు ప్రచారానికి రానున్నారు. ఒంటరిగానైనా నగరంలో తమ సత్తా ఏంటో చూపించాలని ఆరు నెలల ముందు నుంచే పలు నియోజకవర్గాలపై దృష్టి సారించి గ్రౌండ్‌లెవల్‌ నుంచి పార్టీ కార్యక్రమాలను పటిష్ఠం చేశారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ఇతర ఓట్లను రాబట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన బీజేపీకి ఊహించని దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ పట్టున్న నియోజకవర్గాల్లోనే బస్తీ నేతల నుంచి రాష్ట్ర నేతల వరకు టీఆర్‌ఎస్‌ బాటపడుతున్నారు.

అంబర్‌పేటలో ఊహించని షాక్‌
అంబర్‌పేట నియోజకవర్గంలో వరుసగా విజయాల పరంపర కొనసాగిస్తున్న బీజేపీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. నియోజకవర్గంలోని బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆకర్షించేందుకు స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అస్త్రశస్ర్తాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో గోల్నాక, అంబర్‌పేట, నల్లకుంట డివిజన్లకు చెందిన నేతలు రాజీనామా చేసి టీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలుపుతున్నారు. అంబర్‌పేట డివిజన్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. ఆనంద్‌గౌడ్‌ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే అభ్యర్థి జి. కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గోల్నాక డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకులు దామోదర్‌నాయుడు, రాజు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎ్‌సలో చేరగా, నల్లకుంట డివిజన్‌ రత్నానగర్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు ప్రశాంత్‌ ముదిరాజ్‌, పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. చివరి నిమిషంలో టికెట్‌ దక్కించుకొని ఎన్నికల బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌ బీజేపీకి ఊహించని షాక్‌లు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభావం చూపే స్థాయిలో ఉన్న మైనార్టీ ఓట్లు తనకేనంటూ ధీమాతో ఉన్న ఆయన బీజేపీ ఓటు బ్యాంకును చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీసీ సామాజిక వర్గమనే టీఆర్‌ఎస్‌ అస్త్రం బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి మింగుడు పడటం లేదు.

Image result for narendra modi

గోషామహల్‌లో బీజేపీ ఓటు బ్యాంకుకు గండి
గోషామహల్‌లో బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకు ఉత్తరాది వారు. ఆ ఓటు బ్యాంకును టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ గండికొడుతున్నారు. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌తో మొన్నటి వరకు ప్రచారంలో పాల్గొన్న నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఉత్తరాదీల ఓట్లపై గురిపెట్టిన ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ ఆ మేరకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. బీజేపీ గ్రేటర్‌ ఉపాధ్యక్షులు, స్థానికంగా పట్టున్న గోవింద్‌ రాఠి, మాజీ ఉపాఽధ్యక్షులు అందె లక్ష్మణ్‌, పార్టీ అధికార ప్రతినిధి అద్దాల రవీందర్‌, యువజన విభాగం నేత టి. ప్రవీణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, శృతిచరణ్‌ పలువురు నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌కు మద్దతుగా టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్లు ప్రకటించడంతో స్థానిక బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఉత్తరాది వారిలో బలమైన సామాజిక వర్గం నేతలు రాత్రికి రాత్రే టీఆర్‌ఎస్‌ వైపు మళ్ళారు.

ఆబిడ్స్‌లోని కరీమాబాద్‌ హౌసింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ నివాసితులు ఖోజా సామాజిక వర్గం టీఆర్‌ఎస్‌ వెంట నడిచేందుకు సిద్ధమయింది. గుజరాతీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సౌత్‌ ఇండియా అధ్యక్షులు టీఆర్‌ఎ్‌సకు మద్దతు ప్రకటించడం విశేషం. గోషామహల్‌లో బీజేపీ ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు టీఆర్‌ఎస్‌ విస్తృతంగా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

బస్తీల నేతలకే..
బీజేపీకి పట్టున్న అంబర్‌పేట, ఉప్పల్‌, ముషీరాబాద్‌, గోషామహల్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ప్రత్యర్థి అభ్యర్థులు బస్తీ నేతలకు గాలం వేస్తున్నారు. నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసిన నేతను కానీ, బూత్‌ కమిటీ మెంబర్లను, కార్యకర్తలను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులే రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం సమయంలో చెయ్యందిస్తే భవిష్యత్‌కు బాసటగా నిలుస్తామని, అన్నీ రకాలుగా అండగా ఉంటామని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన బీజేపీ అభ్యర్థులను వలసలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *