Home / News / నన్ను తక్కువగా అంచనా వేయొద్దు…..రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూడండి: చంద్రబాబు

నన్ను తక్కువగా అంచనా వేయొద్దు…..రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూడండి: చంద్రబాబు

ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికే అధికార-ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు… రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ’.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

శనివారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనమై వెళ్తున్నారు. మరోవైపు శనివారం ఉదయం 10 గంటల కల్లా టీడీపీ ఎంపీలంతా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముందుగా ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఐటీ దాడులు, జగన్‌పై దాడి ఘటన, కేంద్రం సహాయ నిరాకరణపై టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

జాతీయ మీడియాతో జరిగే సమావేశంలో చంద్రబాబు.. గవర్నర్ వ్యవస్థపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో వేలు పెడుతున్నారంటూ చంద్రబాబు నిన్ననే మండిపడ్డారు. గవర్నర్.. ఏపీ డీజీపీకి ఫోన్ చేసి జగన్‌పై జరిగిన దాడిపై నివేదిక అడిగిన నేపథ్యంలో చంద్రబాబు కన్నెర్ర జేశారు.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *