Home / Politics / కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని?

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని?

..విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. పార్టీ ముఖ్యనేతలు ఈ ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ, సుహాసిని అభ్యర్థిత్వం ఖరారయితే తెలంగాణలో ఎన్టీఆర్‌ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మళ్లీ ఆమే పోటీ చేసినట్లవుతుంది. సుహాసిని.. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌ సతీమణి. కూకట్‌పల్లి నుంచి ఆమెను బరిలోకి దింపాలన్న యోచనపై టీడీపీ సీనియర్‌ నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
‘‘ఆ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీచేస్తే బాగుంటుందని భావించాం. హరికృష్ణ కుమారుడు కళ్యాణ్‌రాం లేదా కూతురు సుహాసిని పోటీపై పార్టీలో చర్చించాం. కళ్యాణ్‌రాం ఆసక్తి కనబరచలేదు. అందుకే సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాం’’ అని ఆయన వివరించారు. ఈ సీటు కాక, టీడీపీ ప్రకటించాల్సిన మిగతా నాలుగు స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ముఖ్యనేతలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కూటమి సర్దుబాట్లలో కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ ఇప్పటికే ఆ పార్టీ ఖాతాలో చేరాయి. బాన్సువాడ-నిజామాబాద్‌ రూరల్‌, ఖైరతాబాద్‌-సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌-ఇబ్రహీంపట్నం స్థానాల్లో ఏవైనా మూడు టీడీపీకి దక్కనున్నాయి.
‘కూకట్‌పల్లి’ కోసం తీవ్ర పోటీ..
ఏపీ నుంచి వచ్చి స్థిరపడినవారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటైన కూకట్‌పల్లి సీటు కోసం తీవ్రపోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి తానే పోటీ చేయబోతున్నట్టు పార్టీ సీనియర్‌ నేత పెద్ది రెడ్డి కొద్దిరోజులుగా స్థానిక కార్యకర్తలకు చెబుతూవచ్చారు. ఈయనకు పోటీగా మందాడి శ్రీనివాసరావు కూడా గట్టి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇద్దరు నాయకులూ మూడురోజుల కిందట భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. కూకట్‌పల్లి స్థానాన్ని బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా పెరిగింది. ఈ స్థానాన్ని కాపులకు కేటాయించాలని ఏపీకి చెందిన కొంతమంది కాపు నేతలు.. బీసీలకు ఇవ్వాలని పలు బీసీ సంఘాలు కూడా చంద్రబాబును కోరినట్లు సమాచారం. కాపు సామాజికవర్గానికి చెందిన ప్రేమ్‌కుమార్‌, పారిశ్రామిక వేత్త ప్రభాకర్‌రావులు అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌ కావ్యారెడ్డి భర్త హరీశ్‌ రెడ్డి మంగళవారం విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకుని, తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *