Home / Politics / ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంత దిగాజరి పోతారెందుకు ? ఆయన ప్రధాని అనే సోయ కూడా లేదా ?

ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంత దిగాజరి పోతారెందుకు ? ఆయన ప్రధాని అనే సోయ కూడా లేదా ?

ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడే బీజేపీ పార్టీకి, అయోధ్య గుర్తుకు వస్తుంది, మోడీని చంపే కుట్ర అనే వార్తలు వస్తాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నెహ్రు మాత్రమే ఈ దేశానికి అన్యాయం చేసారు అనే మాటలు వస్తాయి. ప్రతి ఎన్నికల ప్రచారంలో ఇవే డైలాగులు. ప్రధాని మోడీ కూడా అంతే. ఈ ఆరోపణల వరకు అయితే, ఎవరికీ ఇబ్బంది ఉండదు. ప్రదాని అయినా, సియం అయినా, ఎన్నికల ప్రచారంలో, రాజకీయ విమర్శలు చెయ్యటం, చాలా సహజం. ఇక్కడ వరకు ఎవరినీ తప్పుబట్టటానికి లేదు. కాని ప్రధాని హోదాలో ఉంటూ, తమ అసమర్ధత కనపడకుండా చెయ్యటానికి, ఏకంగా సుప్రీం కోర్ట్ మీదే విమర్శలు చెయ్యటం, ఎప్పుడైనా చూసామా ? అన్ని వ్యవస్థలు సర్వ నాశనం చేసిన మోడీ గారు, తన చేతాకని తనాన్ని, సుప్రీం కోర్ట్ మీదకు నెట్టేసి, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

modi 26112018 2

ఈ ఏడాది మొదట్లో అయోధ్య కేసుల విచారణ చేపట్టాలని ప్రయత్నించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులను అభిశంసన పేరుతో కాంగ్రెస్‌ బెదిరించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఎవరి పేర్లూ ప్రస్తావించని మోదీ…. న్యాయవాదులు కూడా అయిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు 2019 లోక్‌సభ ఎన్నికలయ్యే వరకు అయోధ్య కేసుల విచారణ ఆలస్యమయ్యేలా సర్వోన్నత న్యాయస్థానం జడ్జిలను భయపెట్టారని విమర్శలు చేసారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం వీహెచ్‌పీ భారీస్థాయిలో ధర్మ సభ నిర్వహించిన రోజే మోదీ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. రాజస్థాన్‌లోని అల్వర్‌లో, మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఆదివారం నిర్వహించిన సభల్లో ఆయన కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. న్యాయ వ్యవస్థలో ఆ పార్టీ భయ వాతావరణాన్ని సృష్టించిందన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏడు ప్రతిపక్ష పార్టీలు అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అభిశంసన నోటీసు ఇవ్వడం, దాన్ని రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరించడం తెలిసిందే. ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థలపై కాంగ్రెస్ కు నమ్మకం లేదని మోదీ విమర్శించారు. ‘‘ఓ సుప్రీం కోర్టు జడ్జి వాళ్ల (కాంగ్రెస్‌) రాజకీయ ఉద్దేశాలకు అనుగుణంగా కేసుల విచారణ టైమ్‌ టేబుల్‌ రూపొందించకపోయినా, అయోధ్య వంటి సున్నితమైన కేసులో అందరి వాదనలు విని న్యాయం చేయాలనుకున్నా అప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా అయిన ఆ పార్టీ న్యాయవాదులు అభిశంసన పేరుతో జడ్జిలను భయపెట్టే ఆట మొదలుపెడతారు’’ అని మోదీ చెప్పారు. అయితే, మోడీ ఇలా దిగజారి ఏకంగా సుప్రీం కోర్ట్, కాంగ్రెస్ చెప్పినట్టు నడుస్తుంది అనే సంకేతాలు ప్రజలకు ఇచ్చారు. ఇది ఎంత వరకు సమంజసం ? తమ చేతకాని తనాన్ని, ఇలా కోర్ట్ ల పై నెట్టేసి, ఒక ప్రధాని ఆరోపణలు చెయ్యటం, బహుసా ఎప్పుడూ లేదేమో..

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *