Home / News / జగన్మోహన్ రెడ్డి మీద MLA యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్..

జగన్మోహన్ రెడ్డి మీద MLA యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్..

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్. ఈ రోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై ఆయన పార్టీ కి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేస్తే దానికి ప్రభుత్వ పై దుమ్మెత్తిపోయడం చాలా దుర్మార్గం. గత ఆరు నెలల క్రితం సినీ హీరో శివాజీ ఆపరేషన్ గరుడ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగిద్ది అని చెప్పిన మాట నేడు నిజమైంది..

 

జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది.. నెల్లూరు MLA అనిల్ కుమార్ యాదవ్ నా కొడుకల్లారా అని మాట్లాడుతున్నాడు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. లేదంటే నాలుక తెగ కోస్తాం మీరు ఏమీ అనుకుట్టున్నారేమో.. వైసీపీ నాయకుల్లారా మీ నోటీకి వచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు: యరపతినేని

తెలుగుదేశం పార్టీ నాయకులు మీ క్రింద చెంచా లాగా కనిపిస్తున్నారా?,

మాకు చేతకాక కాదు,మా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం.

జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ పెట్టుకొని నేడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు..

దాడిని అడ్డం పెట్టుకొని రాష్ట్రములో వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు..

జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగితే కేంద్రంలో జీవియల్ నరసింహారావు, రాష్ట్రములో బీజేపీ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చాలా దుర్మార్గంగా ఉంది..

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *