Home / Politics / మిషన్‌ @ 100

మిషన్‌ @ 100

ఫోన్‌ ద్వారా నేరుగా ప్రతి ఓటరునూ చేరుకోవటానికి టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం కొత్తగా కాల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది. వేర్వేరు కారణాలతో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీలు కుదరని ఎన్నారైలు, ఇతర రాష్ట్రాల్లోని టీఆర్‌ఎస్‌ అభిమానులు, ఉద్యోగాల్లో బిజీగా ఉండే ఔత్సాహికులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. వారు సులభంగా ఓటర్లను చేరుకోవటానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌/యా్‌పను రూపొందించింది. టీఆర్‌ఎస్‌ విజయం కోసం వలంటీర్‌గా పని చేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగా ఈ వెబ్‌సైట్‌/యా్‌పలో తమ పేరు నమోదు చేసుకోవాలి. ప్రధానంగా విదేశాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాల సభ్యులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థుల బంధువులు, మిత్రులు, అభిమానులతో పాటు ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజక వర్గాల్లో నియమించుకున్న టెలి కాలర్స్‌- యూత్‌ వలంటీర్లను కాలర్లుగా రిజిష్టర్‌ చేసుకోవాలని నిర్ణయించారు.
వీరు కాకుండా ఎవరైనా స్వచ్ఛందంగా నమోదు చేసుకుంటే.. వారి పేర్లు, వివరాలను పార్టీ యంత్రాంగం పరిశీలించిన తర్వాతే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. వారు లాగిన్‌ అయిన తర్వాత తమకు నచ్చిన నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. సదరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు/ఓటరు పేరు, ఫోన్‌ నెంబర్‌ తదితర వివరాలు కంప్యూటర్‌ స్ర్కీన్‌పై ప్రత్యక్షమవుతాయి. అక్కడి నుంచే వారికి కాల్‌ చేసి మాట్లాడతారు. ఒక కాల్‌ మాట్లాడిన తర్వాతే మరో లబ్ధిదారు వివరాలు కంప్యూటర్‌ స్ర్కీన్‌పై వస్తాయి. ఈ వెబ్‌సైట్‌/యా్‌పలో ఉన్న ఫోన్‌ నెంబర్లు, లబ్ధిదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఎన్నారైలు, ఇతర రాష్ట్రాల్లోని వలంటీర్లకు ఆన్‌లైన్‌లో, మిగిలిన వారికి వీడియోలతో శిక్షణ ఇస్తారు. స్థానిక కార్యకర్తలకు హైదరాబాద్‌లో శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లతో మాట్లాడిన తర్వాత వలంటీర్లు ఫీడ్‌బ్యాక్‌ను క్రోడీకరించి.. దానిని పార్టీ కేంద్ర కార్యాలయం, సంబంధిత అభ్యర్థికి పంపిస్తారు.
Image result for trs
ఇక ప్రచార యుద్ధానికి..!
అసెంబ్లీ ఎన్నికల్లో ‘సెంచరీ’ కొట్టి తీరుతామనే ధీమాతో ఉన్న కేసీఆర్‌.. అందుకు తగినట్లు పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో ప్రచారం చేపట్టి, ప్రతి ఓటరును తమవైపు తిప్పుకొనేలా ఇప్పటికే రూపొందించిన కార్యాచరణను అమల్లో పెట్టిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావటంతో పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిసారించాలని అన్ని స్థాయిల పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ అభ్యర్థిని ఒక్కో ఇన్‌చార్జీ, పరిశీలకుడు, సమన్వయకర్తతో అనుసంధానం చేశారు. ప్రత్యేక బృందాలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అన్ని మూలల నుంచీ సమాచారాన్ని సేకరించి, అధినేతకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు.
నివేదికల ప్రాతిపదికన అభ్యర్థులకు స్వయంగా సూచన సలహాలు ఇస్తున్నారు. రోజుకు కొంతమంది అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. సభలు, సమావేశాలు, కరపత్రాలు, లేఖలు, పాటలు, ప్రసంగాలు, సోషల్‌ మీడియా, సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు, ఫ్లాష్‌ మాబ్స్‌.. ఇలా అన్ని రకాల ప్రచార ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. వంద సీట్లలో గెలవడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారని, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *