Home / News / చంద్రబాబు పై తీవ్రవిమర్శల ట్వీట్స్ చేసిన కేటీఆర్, సూపర్ కౌంటర్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు

చంద్రబాబు పై తీవ్రవిమర్శల ట్వీట్స్ చేసిన కేటీఆర్, సూపర్ కౌంటర్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు

టీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మహాకూటమిపై విమర్శలు సంధిస్తున్నారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్‌ చేసుకుని మహాకూటమిపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఒకనాడు కాంగ్రెస్‌ను విమర్శిస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్లనే రీట్వీట్ చేస్తూ… విమర్శలు ఎక్కుపెట్టారు. అవినీతి కాంగ్రెస్ విముక్త భారతమే మన లక్ష్యం. అది సాధించడానికి ఏం చేయాలో అది చేద్దాం… మన నిస్వార్థ కూటమి గురించి చరిత్రే చెబుతుంది అంటూ 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘ఫేమస్ లాస్ట్ వర్డ్స్’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అలాగే మరో ట్వీట్… చంద్రబాబు గారి నుంచి వచ్చిన మరో ఆణిముత్యం అంటూ రాహుల్, సోనియా గాంధీలు తెలంగాణపై కొత్తగా ఒలకబోస్తున్న ప్రేమ దుర్మార్గమైనది.

తెలంగాణకు చివరిసారిగా వాళ్లు వచ్చింది ఎప్పుడు.. అభివృద్ధి కోసం వాళ్లు చేసిందేమిటి అని 2014 ఏప్రిల్ 26న చంద్రబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 2014 వరకు స్కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా తెలంగాణ కోసం ఏమీ చేయకపోతే.. ఇంతలో వచ్చిన మార్పు ఏంటి? అంటూ టీడీపీ అధినేతను ప్రశ్నించారు కేటీఆర్. అన్ని జిల్లాల్లో ప్రజాగర్జన సభలు ముగిసే నాటికి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతమవుతుంది. ఇటాలియన్ మాఫియా రాజ్‌కు ముగింపిది. ఇదే నా జోస్యం అంటూ 2014 ఫిబ్రవరి 15న చంద్రబాబు మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ… అందుకే కదా దీన్ని నేను మహా చెత్త కూటమి అంటున్నా అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. అయితే తెలుగు తమ్ముళ్లు దీనికి ధీటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ లో కలిపేస్తామని, తెరాస బాధ్యత తీరింది అని చెప్పింది మీరు కాదా అని అడిగారు. అంతే కాకుండా మూకుమ్మడిగా కుటుంబం అంతా వెళ్లి సోనియా గాంధీ ని కలిసి రాలేదా? 2004 లో కాంగ్రెస్ తో మీరు దేనికి పొత్తు పెట్టుకున్నారు? 2004 నుంచి 2009 మధ్యలో కాంగ్రెస్ కేంద్రంలో ఉండగా తెలంగాణా దేనికి సాధించలేకపోయారు. మీకు బిజెపి కి ఉన్న రహస్య ఒప్పందం ఏంటి ప్రశ్నల వర్షం కురిపించారు.

So the “Italian Mafia Raj” (as described below) has new friends now. Guess who it is ?

Now you know why I call it #MahaGhatiyaBandhan pic.twitter.com/RQQCOueTd7

— KTR (@KTRTRS) October 9, 2018

Another pearl of wisdom from CBN Garu👇

If Scamgress leaders Rahul & Sonia didn’t do squat for Telangana development till 2014, what changed since then? #MahaGhatiyaBandhan pic.twitter.com/jfX0anT1mi

— KTR (@KTRTRS) October 9, 2018

“Our aim is to make nation free of corrupt congress”.

Famous last words 😅👇#MahaGhatiyaBandhan pic.twitter.com/N6UQfSTePw

— KTR (@KTRTRS) October 9, 2018

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *