Home / Politics / ‘కేసీఆర్.. వీటిలో నేను దేనికి అడ్డుపడ్డాను?’

‘కేసీఆర్.. వీటిలో నేను దేనికి అడ్డుపడ్డాను?’

దళితుడ్ని సీఎం చేస్తానన్న హామీపైనా, లేదా యువకులకు ఉద్యోగాల కల్పనపైనా, లేదా డబుల్ బెడ్ రూమ్‌లను కట్టే దానిపైనా? ఏ విషయంలో తాను సీఎం కేసీఆర్‌కి అడ్డు పడ్డానో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కి సవాల్ విసిరారు. సనత్ నగర్‌లో ప్రజాకూటమి ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. టీఆర్‌ఎస్ గురించి చెడుగా మాట్లాడానా? తానేం తప్పు చేశానని తిడుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. బంగారు తెలంగాణ రావాలి, అందరూ ఆనందంగా ఉండాలనేదే తన కోరిక అని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని కాంక్షించారు. జీవితంలో ఎప్పుడూ చూడనంత స్పందన సనత్‌నగర్‌లో చూస్తున్నామన్నారు. కార్యకర్తల ఉత్సాహంతో తనకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయని, ఆకస్మిక తనిఖీల పేరిట వందల సార్లు హైదరాబాద్ గల్లీ గల్లీ తిరిగానని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్, తెలంగాణ భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలని, మహాకూటమి పోటీ చేస్తున్న అన్ని సీట్లను గెలిపించి కూటమిని అధికారంలోకి తేవాలని, రాబోయే ఎన్నికల్లో మహాకూటమి విజయ దుందుభి మోగించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు తెలంగాణ ఎన్నికలు ముఖ్యమని, ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
kukatapalli 28112018
పెత్తనం చేయడానికి వచ్చానని కేసీఆర్ విమర్శిస్తున్నారని, టీడీపీ పోటీ చేసేది కేవలం 13 సీట్లలోనే అయినప్పుడు పెత్తనం చేయడానికి తాను ఎందుకు ప్రయత్నిస్తానన్నారు. 37 సంవత్సరాలు టీడీపీ, కాంగ్రెస్ విపక్షంగా ఉన్నాయని, దేశ ప్రయోజనాల కోసం నేడు కలవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతిచ్చారని, అలాగే ఐటీ రంగంలో గుర్తింపు వచ్చింది చంద్రబాబు వల్లేనని చెప్పారని, కానీ ఇప్పడు మాత్రం అధికారం కోసం తనను తిడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే కేసీఆర్ మోదీతో దోస్తీ చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. మోదీ సహకారంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని ఆరోపించారు. ఒక పక్క బీజేపీతో మరోవైపు ఎంఐఎంతో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ద్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వంతో హైదరాబాద్‌కి రూపాయి అయినా లాభం కలిగిందా అని ప్రశ్నించారు. జీఎస్టీతో సరిగ్గా అమలు చేయకపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రూపాయి విలువ కూడా పడిపోయిందని, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో చిన్న వ్యాపారులు దెబ్బతిన్నారని విమర్శించారు. అదే విధంగా దేశంలో అసహనం పెరిగిపోయిందని, మైనారిటీలు, ఎస్సీలపై దాడులు పెరిగాయన్నారు. త్రిపుల్ తలాక్‌ని అడ్డం పెట్టుకొని బీజేపీ మైనారిటీలను వేధిస్తోందని, దాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయని చెప్పారు.
kukatapalli 28112018
టీఆర్ఎస్ గురించి తాను ఎన్నడైనా చెడుగా మాట్లాడానా? తానేం తప్పు చేశానని కేసీఆర్ సంస్కారం లేకుండా తిడుతున్నారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. హైదరాబాద్‌లో సంపద పెరిగిందంటే, అలాగే ఐటీ రంగంలో నగరానికి గుర్తింపు వచ్చిందంటే అది చంద్రబాబే అని కవిత, కేటీఆర్ అన్న మాట వాస్తవం కాదా? అని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌ను తాను నిర్మించానని ఎన్నడూ చెప్పలేదని, కేవలం సైబరాబాద్‌ని మాత్రమే తయారు చేశానని చెప్పానని, కానీ ఈనాడు తనను కొందరు అనవసరంగా ఎగతాళి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కులీకుతుబ్షా హైదరాబాద్‌ను నిర్మిస్తే తాము సైబరాబాద్‌కు నాంది పలికామని, అంతేకాకుండా హైటెక్ సిటీ, శిల్పారామం, జినోమ్ వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రం, కృష్ణా నీటిని హైదరాబాద్‌కు తెచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రపంచ పటంలో నగరాన్ని పెడితే ఎగతాళి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ఓ నాలెడ్జ్ కేంద్రం, తెలుగు వారికోసం మైక్రోసాఫ్ట్ తరహా అనేక కంపెనీలు తీసుకురావడానికి కృషి చేశానన్నారు. మెట్రో కూడా టీడీపీ హయాంలోనే మొదలైందని, తర్వాత ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. కేసీఆర్ వల్లే మెట్రో ఆలస్యమైందని, ఆయన మెట్రోకు అడ్డు పడ్డారు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌ను కొత్తగా ఏమైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు.
అలాగే ఓటు వేసే సమయంలో ఈవీఎంల పట్ల అప్రమత్తతతో ఉండాలన్నారు. ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగే అవకాశాలున్నాయని, ప్రతి ఒక్కరు జాగ్రత్తతో ఓటు వేయాలని చంద్రబాబు తెలిపారు. ఎటువంటి అనుమానం కలిగినా వెంటనే ఫిర్యాదు ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నేతలు సమస్యను పరిష్కరిస్తారన్నారు. అవకతవకలు జరగకపోతే కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం అని జోస్యం చెప్పారు.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *