Home / Politics / హైటెక్ సిటీ వచ్చిన చంద్రబాబుకు, ఐటి ఉద్యోగులు ఏ ప్లకార్డులు పట్టుకుని స్వాగతం పలికారో చూడండి..

హైటెక్ సిటీ వచ్చిన చంద్రబాబుకు, ఐటి ఉద్యోగులు ఏ ప్లకార్డులు పట్టుకుని స్వాగతం పలికారో చూడండి..

తెలంగాణలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో బాబు రోడ్‌షో నిర్వహిస్తున్నారు. భవ్య ఆనంద్ ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా, అక్కడకి వచ్చిన యువత ‘‘వుయ్‌ లవ్‌ చంద్రబాబు. వుయ్‌ మిస్‌ యూ చంద్రబాబు. మీ వల్లే మేం ఇక్కడ ఉన్నాం’ ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు స్వాగతం పలికారు. చంద్రబాబుకు స్థానిక యువత, కార్యకర్తలు, పలువురు ఐటీ ఉద్యోగులు అపూర్వ స్వాగతం పలికారు. చంద్రబాబు అభివాదం చేసిన సందర్భంగా కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

hitechcity 29112018 2

నేతలు తమ ప్రసంగాల్లో చంద్రబాబు పేరును ప్రస్తావించినప్పుడల్లా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కార్యకర్తలను చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయంటూ చంద్రబాబు ప్రారంభించిన ప్రసంగం.. ఆద్యంతం వాళ్లను ఉత్సాహభరితులను చేస్తూ సాగింది. సైబరాబాద్‌ ఏర్పాటు, హైదరాబాద్‌ అభివృద్ధి కోసం తాను సీఎంగా ఉన్న సమయంలో చేసిన పనులను ప్రస్తావిస్తూ.. సభికులకు పలు ప్రశ్నలు సంధించారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌పై తనదైన శైలిలో ఎదురు దాడి చేశారు. కార్యకర్తలను ఆయన తమ్ముళ్లూ అంటూ సంబోధించినప్పుడల్లా రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.

అబద్ధాలు చెప్పే కేసీఆర్‌కు ఓటుతోనే సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు కావాల్సిందే రాజకీయమేనని అందుకే తనను విమర్శిస్తూ రాజకీయాలు చేస్తారని చంద్రబాబు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని, ఇద్దరం కలిసి పనిచేద్దామంటే కేసీఆర్‌ ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీకి బి టీమ్ కేసీఆర్ అంటూ ఆరోపించారు. దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయని అందులో ఒకటి బీజేపీ ఫ్రంట్‌, మరోటి బీజేపీ వ్యతిరేకి ఫ్రంట్ అని చెప్పారు. కేసీఆర్ ఏ ఫ్రంట్‌లో ఉన్నారో తేల్చుకోవాలన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి, ఐటీ అభివృద్ధికి.. చంద్రబాబే కారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాంటిది తనను ఏ మొహం పెట్టుకొని విమర్శిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌, దళితులకు మూడెకరాల భూమి ఎవరికిచ్చారని నిలదీశారు.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *