Home / News / మాటలు జారిన గుర‌జాల మాజీ ఎమ్మెల్యే, పరువు తీసేసిన ప్రజలు,గుంటూరు జిల్లాలో ట్విస్ట్

మాటలు జారిన గుర‌జాల మాజీ ఎమ్మెల్యే, పరువు తీసేసిన ప్రజలు,గుంటూరు జిల్లాలో ట్విస్ట్

గుంటూరు జిల్లాలోని గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని నాయ‌కుడిగా దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుపై వైసీపీ నాయకుడు జంగా కృష్ణ‌మూర్తి అవాకులు చెవాకులు పేల‌డాన్ని నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు చూసి న‌వ్వుకుంటున్నారు. అవినీతి, అన్యాయం గురించి య‌ర‌ప‌తినేనిని ప్ర‌శ్నిస్తున్న‌ జంగా ఒక్క‌సారి వెనక్కి తిరిగి మ‌చ్చ‌లు చూసుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. స‌ర‌స్వ‌తి భూముల్లో జ‌గ‌న్ అండ్ కో కోట్లు కొల్ల‌గొట్టిన విష‌యం మ‌రిచిపోయారా? అని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. ఏదైనా అనేముందు మ‌న‌కింద మ‌చ్చ‌లు కూడా ఉన్నాయ‌ని తెలుసుకుంటే మంచిద‌ని చెబుతున్నారు. అదేవిధంగా పార్టీ టికెట్ల విష‌యంలోనూ, బీసీల‌కు న్యాయం విష‌యంలోనూ కూడా జంగా ప్ర‌శ్న‌లు ఆవేద‌న క‌లిగిస్తున్నాయ‌ని అంటున్నారు. బీసీల‌కు న్యాయం చేయ‌డ‌మంటే.. ఉన్న‌వారికి, న‌మ్ముకున్న‌వారికి నోట్లో మ‌ట్టికొట్ట‌డ‌మా? అని ప్ర‌శ్నిస్తున్నారు. నీకు మాత్రం జ‌గ‌న్ చేసింది ఏమిటి? అని నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న్ను న‌మ్ముకున్న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో జ‌గ‌న్ తండ్రి వైఎస్ నుంచి నీకు ప‌రాభ‌వం ఎదురు కాలేదా? అయినా సిగ్గు లేకుండా మ‌ళ్లీ వైఎస్ కుటుంబం పంచ‌న చేరి టికెట్ల కోసం దేబిరిస్తున్న ప‌రిస్థితి ఉంది. మ‌రి దీనిని ఎలా అర్ధం చేసుకోవాలో..

జంగా కొద్దిగా వివ‌రిస్తే మంచిదని సూచిస్తున్నారు. 1999, 2004లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన‌ప్ప‌టికీ.. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో వైఎస్ మీకు ఎందుకు టికెట్ ఇవ్వ లేదో కూడా ఇప్పుడు సంద‌ర్భం వచ్చింది కాబ‌ట్టి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తే మంచిద‌ని అంటున్నారు. అప్ప‌ట్లో టికెట్ ఇవ్వ‌క‌పోయిన నేప‌థ్యంలో మీరు రోడ్డెక్కి వైఎస్‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నాలు చేసిన‌రోజుల‌ను మ‌రిచిపోయారా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. 2009 ఎన్నిక‌ల్లో జంగా చేసిన అవినీతితో విసిగి వేసారిపోయిన వైఎస్ జంగాకు టిక్కెట్ ఇవ్వ‌కుండా గుంటూరుకు చెందిన డాక్ట‌ర్ ఆలా వెంక‌టేశ్వ‌ర‌రావుకు సీటు ఇచ్చారు. దీంతో వైఎస్ అంతు చూస్తాన‌న్న జంగా నిరాహార దీక్ష‌లు కూడా చేశారు. ఇక‌, ఇప్పుడు కేవ‌లం డ‌బ్బులే ప్రాతిప‌దిక‌గా.. జ‌గ‌న్ వేస్తున్న అడుగుల‌కు కూడా మీరు మ‌డుగులు ఒత్తుతున్నారు. దీనిని ప్ర‌జ‌లు న‌మ్మాల‌ని చెబుతున్నారు. ఎలా సాధ్యం? ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు స‌హ‌జ‌మే. కానీ, ప‌దుల, వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టేవారికి మాత్ర‌మే సీటు, టికెట్ అంటూ కూర్చుంటే ప‌రిస్థితి ఏంటి? అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది క‌దా..

అంతెందుకు జ‌గ‌న్ గురజాల ఇన్‌చార్జ్‌గా జంగా వ‌ద్ద డ‌బ్బులేద‌ని త‌ప్పించిన‌ప్పుడు జంగా త‌న‌కు జ‌గ‌న్ తీవ్ర అన్యాయం చేశారు ? క‌దా ? అని క‌న్నీళ్లు పెట్టుకున్న మాట నిజం కాదా ? అన్న‌ది జిల్లా జ‌నాలంద‌రికి తెలుసు. జంగాకు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్పినా జంగాకు ఈ విష‌యంలో కూడా న‌మ్మ‌కం లేదు. జంగా, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, లేళ్ల అప్పిరెడ్డి ఇలా ఎంత‌మందికి ఎమ్మెల్సీలు ఇస్తారు ? అన్న‌ది జంగాకు తెలియ‌దా ? జ‌గ‌న్ చేతిలో తాను మోస‌పోయాన‌న్న విష‌యం తెలిసి కూడా జంగా క‌ప‌ట‌పు మాట‌లు మాట్లాడుతూ త‌న‌ను తానే ఎందుకు మోసం చేసుకుంటున్నారో ? తెలియ‌ద‌ని ఆయ‌న అనుచ‌రులు బాధ‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరు మాసాల గ‌డువు మాత్ర‌మే ఉంది. కానీ, మీరు మాత్రం ఉలికి ప‌డుతున్నారు. నిజానికి య‌ర‌ప‌తి నేని చేసిన విమ‌ర్శ‌ల్లో మ‌చ్చుకైనా మీరు కొట్టేయ‌గ‌లిగింది ఏమైనా ఉందా? ఆయ‌న కోట్ల రూపాయ‌ల పార్టీ ఫండ్ తీసుకుని చిల‌క‌లూరి పేట‌లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు హ్యాండివ్వ‌లేదా? గుంటూరు-2లో లేళ్ల అప్పిరెడ్డిని ఏ ప్రాతిప‌దిక‌న ప‌క్కన కూర్చోబెట్టారు? ఇక్క‌డ, బీజేపీకి లైన్ క్లియ‌ర్ చేయ‌డానికి ప‌న్నిన ప‌న్నాగం కాదా? మ‌రి ఈ విష‌యం దాచేస్తే దాగుతుందా? ఏదేమైనా.. గురివింద ప‌లుకులు ఇకనైనా త‌గ్గించుకుంటే మంచిద‌ని అంటున్నారు గుర‌జాల స‌హా గుంటూరు జిల్లా ప్ర‌జ‌లు!

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *