Home / Politics / కొడంగల్‌లో టీఆర్ఎస్ నేత ఫార్మ్ హౌస్ లో, భారీగా పట్టుబడ్డ నగదు…

కొడంగల్‌లో టీఆర్ఎస్ నేత ఫార్మ్ హౌస్ లో, భారీగా పట్టుబడ్డ నగదు…

అది మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. తనకి అన్ని విధాలుగా అడ్డు పడుతూ, తన గుట్టు అంతా రచ్చ చేస్తున్న రేవంత్ ను ఈ సారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టారు. అందుకే డబ్బు విషయంలో వెనకాడ కూడదని స్పష్టాతిస్పష్టంగా తన ముఠాకు చెప్పేశారు. పైగా ధనవంతుడైన మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపారు. వందకోట్లైనా ఫర్వాలేదు రేవంత్ రెడ్డి ని ఓడించాలని టార్గెట్ పెట్టారు. కేసీఆర్ ఆదేశం… నోట్ల ఆశీర్వాదం చూసుకుని పట్నం ముఠా రంగంలోకి దిగింది. గడచిన నాలుగు నెలలుగా పచ్చనోటు పుచ్చుకుని కొడంగల్ గడ్డ పై స్వైరవిహారం చేస్తోంది.

ఈ క్రమంలోనే కోస్గీలోని తమ బంధువు, విద్యాశాఖలో జాయింట్ కమిషనర్ రేంజ్ లో పని చేసి రిటైర్ అయిన ఓ వ్యక్తి ఫాంహౌస్ ను కేంద్రంగా చేసుకుని నరేందర్ రెడ్డి అండ్ కో… డబ్బులు వెదజల్లడం మొదలు పెట్టారు. ఇంత విచ్చలవిడి తనంగా వ్యవహారం చేస్తే ఏమౌతుంది… అవ్వాల్సిందే అయింది. మంగళవారం అర్థరాత్రి నరేందర్ రెడ్డి స్టే చేస్తోన్న ఫౌంహౌస్ పై ఐటీ రైడ్స్ జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు పక్కా సమాచారంతో విరుచుకుపడ్డారు. సుమారు 15 కోట్ల రూపాయలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరో ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన లెక్కల వివరాలు స్వాధీనం చేసుకున్నారు. ఫాం హౌస్ సీజ్ చేశారు.

15 కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని రాజీ చేసే ప్రయత్నం చేసినా ఐటీ అధికారులు వినలేదు. దీంతో నరేందర్ రెడ్డి సొమ్ములు అడ్డంగా బుక్కయ్యాయి. పంచనామా కూడా నిర్వహించారు. ఇంత జరిగినా విషయం మాత్రం బయటకు పొక్క లేదు. పొక్కలేదు అనే కంటే… పొక్కకుండా తీవ్రమైన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వీటిని టీఆర్ఎస్ నేతలు కొట్టి పారేసినప్పటికీ, ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ దీన్ని ధృవీకరించడం సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరి ఇళ్లలో సోదాలు జరిగాయని, సోదాకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం మీడియాకు తెలియజేస్తామని రజత్ కుమార్ తెలిపారు. పట్టుబడిన నగదంతా టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువునివిగా భావిస్తున్నారు. ఐటీ సోదాలతో కొడంగల్ రాజకీయాల్లో కలకలం రేగింది.

 

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *