Home / Politics / కేసీఆర్… చంద్రబాబు వస్తున్నాడు… బరాబర్ వస్తున్నాడు.. రేపు తెలంగాణా ప్రజలకు ఇదే చెప్తాడు…

కేసీఆర్… చంద్రబాబు వస్తున్నాడు… బరాబర్ వస్తున్నాడు.. రేపు తెలంగాణా ప్రజలకు ఇదే చెప్తాడు…

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, కేసీఆర్ ప్రధాన అజెండాగా తీసుకుంది చంద్రబాబుని. చంద్రబాబుని ఒక శత్రువుగా, ఒక బూచిగా తెలంగాణా సమాజానికి చూపిస్తున్నారు. చంద్రబాబు కూడా ముందుగా తెలంగాణా ఎన్నికలకు వెళ్ళద్దు అనే అనుకున్నారు. కాని కేసీఆర్ పదే పదే కావాలని, చంద్రబాబుని ఎదో శత్రువుగా చూపిస్తున్నారు. ఇవన్నీ తిప్పికొట్టటానికి చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. అసలు కేసీఆర్ చంద్రబాబుని ఎందుకు తిడుతూన్నాడు ? చంద్రబాబు ప్రచారాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో తెలుసుకుంటే, తెలంగాణా ఉద్యమం నడిచిందే నీళ్లు – నిధులు – నియామకాల కోసం… వీటిలో కేసీఆర్ తెలంగాణాలో ఏమి చేసారు ? ఆంధ్రాలో చంద్రబాబు ఏమి చేసారు అనే చర్చ మొదలైతే ? అదే కేసీఆర్ భయం..

telangana 27112018 2
నీళ్లు : చంద్రబాబు వచ్చి, పట్టిసీమ కట్టి డెల్టాకు నీళ్లిచ్చి, కృష్ణ నీళ్లు రాయలసీమకిచ్చి , పురుషోత్తపట్నంతో ఉత్తరాంధ్రకు నీళ్లిచ్చి, వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసాడో చెపుతాడు… భగీరథ కాకతీయ పేరుతో కేసీఆర్ ఎంత దోచుకున్నాడో తెలంగాణా సమాజానికి కనిపిస్తూనే ఉంది.. అలాగే కేసీఆర్ ఎగువ రాష్ట్రంగా ఉండి, చంద్రబాబు నీళ్లు ఆపుతున్నాడు అని అంటే, రైతులు నమ్ముతారా ? ఈ మాటలు వింటే, రైతులు కేసీఆర్ కు ఓట్లేస్తారా?…. నిధులు : వేల కోట్ల లోటు బడ్జెట్టుతో, ఆదాయం లేని, రాజధాని లేని రాష్ట్రంలో, తాను అద్భుతంగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురుంచి చెపుతాడు. శుభ్రమైన పరిసరాల్లో ఆహారం పెట్టె అన్న కాంటీన్ల గురించి చెపుతాడు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసిన రోడ్ల గురుంచి ఇతర మౌలిక సదుపాయాల గురుంచీ చెపుతాడు, అప్పుడు హైదరాబాద్ రోడ్లు గురించి ప్రజలు ఆలోచించరా ?. రాజధాని భూసేకరణనీ, మల్లన్న సాగర్ భూదోపిడీనీ పోలుస్తాడు. టెక్నాలజీని ఏ విధంగా వాడుతున్నాడో అవినీతిని ఎలా తగ్గించగలిగాడో చెపుతాడు. ఇవన్నీ విన్న ప్రజలకి, కేసీఆర్ ఎన్ని రకాలుగా విఫలం అయ్యాడో అర్ధం కాదా ? కేసీఆర్ కి ఇంకా ఓటేస్తారా?
నియామకాలు : ఖజానా ఖాళీ అయినా, ఎన్ని వేల మందికి ఉద్యోగాలిచ్చాడో చెపుతాడు, ఎన్ని సార్లు డీఎస్సీ ఇచ్చింది చెప్తాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని కేసీఆర్ కి ఏ విద్యార్థయినా నిరుద్యోగయినా ఓటేస్తాడా? అలాగే…కియా లాంటి వేల కోట్లు పెట్టుబడి పెట్టె కంపినీలని తెచ్చి లక్షల ఉద్యోగాలు సృష్టించిన విషయం చెపుతాడు. మరిన్ని లక్షల మందికి స్వయంఉపాది చూపించిన విషయం చెపుతాడు. ఇది విన్నాక, కేసీఆర్ తెచ్చిన ఒక్క కంపెనీ ఏంటి అని ప్రజలు ఆలోచించరా ? ఏ తెలంగాణా యువకుడన్నా ఫార్మ్ హౌస్ లో నాలుగేళ్ళ నుంచీ పడుకున్న కేసీఆర్ కి ఓటేస్తాడా? భావోద్వేగాలు వదిలేసి…వాస్తవిక దృక్పధంతో చంద్రబాబు చెప్పే మాటలు కనీసం 70 శాతం మంది తెలంగాణా ప్రజానీకం వింటది. ఒక నిర్ణయం తీసుకుంటది. కేసీఆర్ అడ్రస్ గల్లంతవుతది. అందుకే చంద్రబాబు ప్రచారాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నాడు… అయినా, చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. బరాబర్ వస్తున్నాడు కేసీఆర్.. తెలంగాణాలో సామాజిక ఆర్ధిక మార్పులకు తెలుగుదేశం ఎలా కారణమో చెప్తాడు… గాజులు అమ్మే హైదరాబాద్ లో, సైబెరాబాద్ సిటీ సృష్టించాను అని చెప్తాడు… నీ దొరల అహంకారం గురించి, నీ కుటుంబం చేసిన దోపిడీ గురించి చెప్తాడు.. ఢిల్లీ అహంకారులతో, ఎలా కుమ్మక్కు అయ్యావో చెప్తాడు.. కాంగ్రెస్ తో ఎందుకు కలిసారో చెప్తాడు… బంగారు తెలంగాణా కావలి అంటే, ఏమి చెయ్యాలో చెప్తాడు… బరాబర్ వస్తాడు… రేపే వస్తున్నాడు… ఖమ్మం గడ్డ మీద అడుగు పెడుతున్నాడు…

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *