Home / News / తెలంగాణలో బీజేపీకి కోలుకోలేని షాక్.. కీలక నేత రాజీనామా

తెలంగాణలో బీజేపీకి కోలుకోలేని షాక్.. కీలక నేత రాజీనామా

తెలంగాణ బీజేపీలో ముసలం నెలకొంది. బీజేపీ అధిష్టానం ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పట్నుంచి పార్టీలో అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయనీ.. దీంతో పలువురు కీలక నేతలు కమలాన్నీ వీడతారని అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర స్థాయి కమలనాథులు అందర్నీ కలుపుకుని ఎన్నికలకు పోవాలని తెలంగాణ నేతలకు పిలుపునిస్తూ వచ్చారు. అయినప్పటికీ లోలోపల నేతలకున్న విబేధాలకు మాత్రం అధిష్టానం ఫుల్‌స్టాప్ వేయలేకపోయిందని చెప్పుకోవచ్చు.


బీజేపీకి కోలుకులేని షాక్..
కరీంనగర్‌లో బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొత్త శ్రీనివాస్ రెడ్డి పార్టీకి, జిల్లా అధ్యక్షపదవికి రాజీనామా చేశారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వలేదని తీవ్ర ఆవేదనతో రాజీనామా చేసినట్లు లేఖలో ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు హుస్నాబాద్ టిక్కెట్ ఇస్తారని ఆశించానన్నారు. అయితే తనకు ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడంతో తీవ్ర ఆవేదనకు లోనైన శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సాయంత్రం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీనే నమ్ముకున్న తనకు బీజేపీ పెద్దలు తీవ్ర అన్యాయం చేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మూడు పేజీలతో కూడిన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు పంపించారు. కాగా ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు..? శ్రీనివాస్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అనే విషయాలు ఇంతవరకూ తెలియరాలేదు. శ్రీనివాస్ రాజీనామా చేసినట్లు తెలుసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖులు ఆయనతో మంతనాలు జరపడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

నడ్డా పర్యటనలో ఉండగానే ఎందుకిలా..?
కాగా.. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న కేంద్రమంత్రి జేపీ నడ్డా హైదరాబాద్‌ పర్యటనలో ఉండగా కీలక నేత రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లిందా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇకనైనా అధిష్టానం అసంతృప్తులకు నచ్చజెప్పి వారిని కలుపుకొని పోవాలని లేకుంటే మున్ముందు ఇంకా పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *