Home / Politics / కేంద్రానికి చంద్ర‌బాబు స‌రికొత్త స‌వాలు… ఈసారి విశాఖ నుంచి…!

కేంద్రానికి చంద్ర‌బాబు స‌రికొత్త స‌వాలు… ఈసారి విశాఖ నుంచి…!

మీరు చెయ్య‌నిది మేం చేసి చూపిస్తాం. మా స‌త్తా ఏమిటో బ‌య‌ట‌పెడ‌తాం. మీ వంచ‌న‌ను, మోసాన్ని ప్ర‌జ‌ల‌కు జీవిత‌కాలం గుర్తుండిపోయేలా చేస్తాం. ఇదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం విష‌యంలో అనుస‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న వైఖ‌రి. రాష్ట్రాన్ని ముక్క‌లు చేసి… కాంగ్రెస్‌తో క‌లిసి ఆ పాపంలో పాలు పంచుకుని న‌డి రోడ్డున ప‌డేసిన ఐదు కోట్ల ఆంధ్రుల స‌త్తా ఏమిటో తెలియ‌జెప్పాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వ‌కుండా మోడీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న మొండి, క‌క్ష‌పూరిత వైఖ‌రిని ప్ర‌జ‌లకు క‌ళ్ల‌కు క‌ట్టాల‌ని చంద్ర‌బాబు నిశ్చియించుకున్నారు. ఒక‌వైపు రాజ‌కీయంగా మోడీని గ‌ద్దె దించేందుకు యుద్ధం చేస్తూనే మ‌రోవైపు రాష్ట్రంలో అభివృద్ధిని వేగిరం చేసి.. చ‌ట్ట‌ప్ర‌కారం ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం ఇవ్వ‌ని వాటి విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రంతో సంబంధం లేకుండా వాటిని రాష్ట్రంలో ఏర్పాటు చేసి మీ త‌ప్పు చేసినా… మోసం చేసినా… వివ‌క్ష ప్ర‌ద‌ర్శించినా మేం త‌లెత్తుకుని ఎలా నిల‌బడ్డామో లోకానికి చూపించాల‌ని చంద్ర‌బాబు సంక‌ల్పించారు. ఆ క్ర‌మంలోనే నిన్న‌నే క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటు చేయాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పైగా ఇందులో కావాలంటే మీరు పెట్టుబ‌డులు పెట్టుకొండి అంటూ కేంద్ర ప్ర‌భుత్వానికే బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన చంద్ర‌బాబు మోడీకి స‌రికొత్త స‌వాలు విసిరారు.

క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారానికి అన్ని అనుకూల‌త‌లు ఉన్నా… కేవ‌లం క‌క్ష పూరిత వైఖ‌రితోనే మోడీ ప్ర‌భుత్వం సీమ‌కు భారీ క‌ర్మాగారం రాకుండా చేస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందుకే కేంద్రం త‌ల‌దించుకునేలా చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. మీ ద‌యాదాక్షిణ్యాలు ఎవ‌రికి కావాలి? మేమే చేసి చూపిస్తాం అంటూ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఇదే ప‌ద్ధ‌తిని మిగిలిన కేంద్ర ప్రభుత్వ హామీల విష‌యంలోనూ ఆచ‌రించాల‌ని టీడీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా ప‌ట్టాలెక్కించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇప్ప‌టికే విశాఖ‌కు చ‌ట్ట‌ప్ర‌కారం రావాల్సిన రైల్వే జోన్ ఇవ్వ‌డానికి కూడా కేంద్రం ఆడుతున్న నాట‌కాలు అంద‌రికీ తెలిసిందే. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న జోన్ ఇవ్వ‌డానికే ఇష్ట‌ప‌డ‌ని బీజేపీ ప్ర‌భుత్వం… ఇక విశాఖ న‌గ‌రానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఇస్తుంద‌న్న ఆశ రాష్ర‌ప్ర‌జ‌ల‌కూ లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా లేదు. ఈ త‌రుణంలోనే విశాఖ మెట్రో రైలుకు అనుమతి లభించిన నేప‌థ్యంలో దీని విష‌యంలో కూడా కేంద్రంపై ఆధార ప‌డ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఈ మెట్రో ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. విభజన చట్టం హామీల్లో భాగంగా విశాఖకు మెట్రో రైలు బాధ్యత కేంద్రానిదే అయినా అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గం కూడా మంగళవారం ఆమోదించింది. దీంతో భారతదేశంలో పీపీపీలో నిర్మించే అతిపెద్ద రెండో మెట్రోగా విశాఖ ప్రాజెక్టు గుర్తింపు పొందింది. దీనికి ఇప్పటికే రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌పీఎ్‌ఫ)ను ఆహ్వానించడంతో ఆ ప్రకారం ముందుకువెళ్లాలని సూచించింది. విశాఖపట్నంలో కొమ్మాది నుంచి గాజువాక వరకు మూడు కారిడార్లుగా విభజించి మొత్తం 42.55 కి.మీ. పొడవున మెట్రో రైల్వే ట్రాక్‌ నిర్మిస్తారు.

వీటికి అవసరమైన చోట స్టేషన్లు, రన్నింగ్‌ సెక్షన్‌, పార్కింగ్‌ సదుపాయాలు, డిపోల ఏర్పాటుకు అవసరమైన 83 ఎకరాల భూమిని ప్రభుత్వం సమకూరుస్తుంది. మరో 12 ఎకరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ఆర్‌పీఎఫ్‌, రాయితీ ఒప్పందాన్ని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో చేపట్టాలని ఆదేశించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన పెట్టుబడి రూ.4200 కోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ లేదా విదేశీ సంస్థల ద్వారా తక్కువ వడ్డీకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు చేపట్టే సంస్థకు పదేళ్లలో రూ.820 కోట్ల వరకు ఆర్థిక సాయం చేస్తారు. ఈ ప్రాజెక్టులో రీఎంబర్స్‌మెంట్‌ చేయాల్సిన మొత్తం రూ.527 కోట్లుగా నిర్ధారించారు. దీనికి అవసరమైన భూముల లావాదేవీలకు సంబంధించి స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు ఇవ్వనున్నారు. మెట్రో రైలుకు గ్రిడ్‌ నుంచి విద్యుత్‌ సరఫరా చేయాల‌ని నిర్ణ‌యించారు.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *