Home / Politics / అన్ని సర్వేలూ…కాంగ్రెస్‌ కూటమి వైపే…!

అన్ని సర్వేలూ…కాంగ్రెస్‌ కూటమి వైపే…!

ఎన్నికలకు మరో 12రోజులు మాత్రమే సమయం ఉండడంతో..తెలంగాణ రాజకీయం పూర్తిగా వేడెక్కింది. వివిధ పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తూ..విజయం కోసం చెమటోడుస్తున్నారు. అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూటమి మధ్య పోరు హోరాహోరిగా సాగుతోంది. మొన్నటి దాకా__అధికార టిఆర్‌ఎస్‌ది ఏకపక్ష విజయమని, ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌తో పాటు, మీడియా సంస్థలు కూడా కోడెకూశాయి.

అయితే కొంగకలాన్‌ సభ తరువాత ఒక్కసారిగా అధికార పార్టీలో ముసలం మొదలైంది. ఆ సభ ప్లాప్‌తో__టిఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ మెల్ల మెల్లగా పడిపోతూ వస్తోంది. ఒక్కసారిగా 105మంది అభ్యర్థులను ప్రకటించి..సాహసం చేసిన ‘కెసిఆర్‌’ వారిని ప్రజల్లోకి పంపించారు. అయితే..ప్రజలు ఎక్కడికక్కడ టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలదీయడం, నిరసనలతో హోరెత్తించడంతో..కెసిఆర్‌ పాలనపై ప్రజలు ఎంత విసుగు చెంది ఉన్నారో బయట ప్రపంచానికి తొలిసారి అర్థమైంది. ఇక అప్పటి నుంచి టిఆర్‌ఎస్‌కు రోజూ ప్రజలు చుక్కలు చూపిస్తూనే ఉన్నారు.

Related image

అభ్యర్థుల నామినేషన్లు ముగిసిన తరువాత..తెలంగాణకు సోనియాగాంధీ రావడం, తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా కృతజ్ఞతను చూపాలని ఓటర్లును ఆమె కోరడంతో..ఒక్కసారిగా కాంగ్రెస్‌ కూటమి విజయం తధ్యమనే భావన సర్వత్రా వ్యాప్తిస్తోంది. ఇది నిజమేనంటూ..పలు సర్వే సంస్థలు రోజుకో సర్వేను ప్రకటిస్తున్నాయి. దీనిలో అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్‌ కూటమికే ఆధిక్యం కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కుహోరా హోరి పోరు ఉందన్న భావన ఉండగా..ఇప్పుడు మాత్రం అధికార పార్టీని తొక్కేసి ‘కాంగ్రెస్‌ కూటమి’ విజయం వైపు పరుగులు తీస్తోందని పలు సర్వే సంస్థలు ప్రకటిస్తున్నాయి.

ఈ రోజు ఢిల్లీ బేస్డ్‌గా పనిచేసే సంస్థ ఒకటి ప్రకటించిన సర్వేలో కాంగ్రెస్‌ కూటమికి 66 సీట్లు టిఆర్‌ఎస్‌కు 42 సీట్లు, బిజెపికి ఐదు సీట్లు, ఎంఐఎంకు 6సీట్లు వస్తాయని ప్రకటించింది. మరో వైపు స్వతంత్య్ర జర్నలిస్టు సంస్థ ఒకటి చేసిన సర్వేలో కాంగ్రెస్‌ కూటమికి 68సీట్లు, టిఆర్‌ఎస్‌కు 37సీట్లు, ఎంఐఎంకు 8సీట్లు, బిజెపికి ఆరు సీట్లు వస్తాయని ప్రకటించింది. మొత్తం మీద..ఏ సర్వే చూసినా..కాంగ్రెస్‌ కూటమి గెలుస్తుందని ఢంకా బజాయించి చెబుతోంది. మరి ఎన్నికల నాటికి పరిస్థితి మరెంత మారుతుందో చూడాలి మరి.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *