Home / Politics / ఆవేశపడుతూ చంద్రబాబు పై వెటకారపు ట్వీట్ చేసి, మరోసారి ఫూల్ అయిన జీవీఎల్…

ఆవేశపడుతూ చంద్రబాబు పై వెటకారపు ట్వీట్ చేసి, మరోసారి ఫూల్ అయిన జీవీఎల్…

ఒక పక్క రాఫెల్ కుంబకోణం పై, దేశం దద్దరిల్లిపోతుంది. కొన్ని వేల కోట్ల రూపాయల స్కాంతో, బీజేపీ అడ్డంగా, నిలువుగా కూడా దొరికిపోయి, దేశ ప్రజల ముందు దోషిగా నిలబడింది. ఇలాంటి దాని పై దేశానికి సమాధానం చెప్పే వాడు బీజేపీలో ఒక్కరు కూడా లేరు. అదేమంటే, హిందుత్వ వాదం తీసుకువస్తారు, రాహుల్ గాంధీ పాకిస్తాన్ తో కలిసి కుట్ర పన్నుతున్నాడు అంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో ఈ దేశానికి అనవసరం. నువ్వు చేసిన స్కాం పై వివరణ ఇవ్వండి అంటే, ఒక్కరు కూడా అడ్రెస్స్ ఉండరు. ఇలాంటి వాళ్ళలో బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఒకరు.

ఆయన జాతీయ స్థాయిలో స్పోక్స్ పర్సన్. అక్కడ ఉంటే ఢిల్లీ మీడియా వెంట పడుతుంది అని, అమిత్ షా కొన్ని రోజులు అమరావతి పోయి, చంద్రబాబు పై విషం చిమ్మమని చెప్పారో ఏమో కాని, రెండు రోజుల నుంచి ఒకటే నస. చంద్రబాబుకి ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన ఆహ్వానం చూసిన తరువాత, పాపం ఈ ఆపరేషన్ గారుడ బ్యాచ్ అంతా, కడుపు మంటతో ఇబ్బంది పడుతున్నారు. మొన్నటికి మొన్న జీవీఎల్ మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పేది అంతా అబద్ధం, సొంత పనులు మీద అమెరికా వెళ్తున్నారు, మీకు దమ్ము ఉంటే చంద్రబాబుకి వచ్చిన ఇన్విటేషన్ చూపించండి అని విమర్శ చేసారు.

దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం, అరగంటలో, చంద్రబాబుకి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఇన్విటేషన్ చూపించింది. అప్పటి నుంచి రెండు రోజుల పాటు అడ్రస్ లేని జీవీఎల్ ఈ రోజు మరో వింత వాదనతో, వెటకారంగా ట్వీట్ చేసారు. “ఇంతకూ మన గ్లోబల్ లీడర్ ఏ సదస్సులో మాట్లాడుతున్నారు? ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 313 కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, అందులో బాబు ప్రసంగించబోయే కార్యక్రమం లేనేలేదు’ అంటూ ట్వీట్ చేసారు. అయితే, చంద్రబాబు వెళ్ళే ఈవెంట్ గురించి యునైటెడ్ నేషన్స్ వెబ్సైటులో స్పష్టంగా ఉంటే, ఈయనకు అది కనిపించలేదు. అమెరికా టైమింగ్స్ ప్రకారం, 24 sept 6:30 PMకి ఇది మొదలవుతుంది. అంటే, మన టైమింగ్స్ ప్రకారం, షుమారుగా రేపు తెల్లవారు జామున 3 గంటలకు. ఇంత స్పష్టంగా ఇక్కడ ఉన్నా, జీవీఎల్ మాత్రం ఫూల్ అయిపోయారు. ఈ ఈవెంట్ ఇక్కడ లైవ్ చూసుకుంటూ, రేపు ఇంకా ఎంత కడుపు మంట చూపిస్తాడో..

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *