Home / Politics / కూట‌మి పొత్తులు ఫిక్స్‌… ఈసారి త్యాగం కాంగ్రెస్ పార్టీదే

కూట‌మి పొత్తులు ఫిక్స్‌… ఈసారి త్యాగం కాంగ్రెస్ పార్టీదే

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల‌లో మ‌హా కూట‌మి పొత్తులు ఫిక్స‌య్యాయి. ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము నాలుగు సీట్లు త్యాగం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని టీడీపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా ఇప్పుడు కాంగ్రెస్ కూడా త్యాగం చేసేందుకు సిద్ధ‌మైంది. తాను పోటీ చేయ‌ద‌ల‌చుకున్న సీట్ల‌లో ఓ రెండు త‌గ్గించుకోవాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించుకుంది. అలా త‌గ్గించుకునే సిట్ల‌లో టీజేఎస్‌కు మరో సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించింది. టీడీపీకి పద్నాలుగు, సీపీఐకి మూడు స్థానాలు ఇవ్వాలన్న నిర్ణయంపై కాంగ్రెస్‌ ఎలాంటి పునరాలోచన చేయడం లేదు. తన కోటాలోంచే ఒక సీటును చెరుకు సుధాకర్‌కు చెందిన తెలంగాణ ఇంటి పార్టీకి ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, టీఐపీ అభ్యర్థి హస్తం గుర్తుపై పోటీ చేయాలన్న షరతుపై ఈ ఒప్పందం కుదిరింది. నకిరేకల్‌, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో ఒకటి ఆ పార్టీకి ఇచ్చే అవకాశం ఉందని స‌మాచారం. అలాగే, టీజేఎస్‌కు ఇచ్చే ఎనిమిది స్థానాల్లో ఐదింటికి సంబంధించి గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌-టీజేఎస్‌ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది.

మరో మూడింటిపై ఒకటి రెండు రోజుల్లో రాజీ కుదురుతుందని భావిస్తున్నారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంటియా, టీజేఎస్‌ నేత దిలీప్‌లు చర్చలు జరిపారు. శుక్రవారం చర్చలకు రావాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం కోదండరామ్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. గురువారం కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన ఖుంటియా మిత్రులకు 25 సీట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 3 సీట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఇంటిపార్టీకి ఒక సీటు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇది కాంగ్రెస్‌ కోటాలోంచే ఇవ్వాల్సి ఉంటుందని అనంతరం పార్టీ వర్గాలు ఆంధ్రజ్యోతికి వివరించాయి. కాంగ్రెస్‌ ‘బీ’ ఫామ్‌ పైనే ఎన్నికల బరిలో దిగుతామని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ తెలిపారు. తమకు ఈసీ ఇస్త్రీ పెట్టెను కేటాయించిందని, ఓట్లు వృథా కాకుండా జాగ్రత్త పడేందుకు చేతి గుర్తుపైనే పోటీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇంటిపార్టీకి కేటాయించింది నకిరేకల్‌ స్థానమా? మహబూబ్‌నగరా? తేలాల్సి ఉంది. నకిరేకల్‌ కేటాయిస్తే సుధాకర్‌ సతీమణి చెరుకు లక్ష్మి, మహబూబ్‌నగర్‌ కేటాయిస్తే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. కాగా, సీపీఐ మాత్రం త‌మ డిమాండ్ నుంచి వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. సీట్ల సర్దుబాటులో భాగంగా కనీసం నాలుగు సీట్లనైనా సీపీఐకి కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదన సంతృప్తికరంగా లేదని చెప్పారు. నాలుగు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ అయితే తమకు అంగీకార యోగ్యమేనని చెప్పారు. కొత్తగూడెం సీటు విషయంలో పదేపదే మాట మార్చడం సరికాదన్నారు. వైరా, హుస్నాబాద్‌, బెల్లంపల్లి/మంచిర్యాల స్థానాలను సీపీఐకు కేటాయించినట్లు తెలుస్తోంది. సీపీఐ తరఫున డి.రాజా ఏఐసీసీ నేతలతో ఢిల్లీలో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

ఇక‌, కాంగ్రెస్‌కు కోదండ‌రాం ఓ హెచ్చ‌రిక చేశార‌ని స‌మాచారం. ‘ముందు టీజేఎస్‌, సీపీఐలకు కేటాయించే స్థానాలను, సంఖ్యను తేల్చాలి. ఆ తర్వాత మీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేసుకోండి’ అని ఏఐసీసీ నేతలకు కోదండరాం స్పష్టం చేసినట్లు స‌మాచారం. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఖరారు అయిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరగటంతో టీజేఎస్‌ ఆశావహులు ఆందోళన వ్యక్తం చేయగా, ఏఐసీసీ నేతలకు కోదండ ఫోన్‌ చేసి మాట్లాడారు. టీజేఎస్‌ అదనంగా మరో నాలుగు స్థానాలను కోరుతోంది. అలా కోరే స్థానాల్లో వర్ధన్నపేట కూడా ఉంది. వరంగల్‌ తూర్పును టీజేఎ్‌సకు కేటాయించేందుకు తొలుత అంగీకరించిన కాంగ్రెస్‌ తర్వాత నిరాకరించింది. దానికి బదులు మేడ్చల్‌ ఇవ్వాలని టీజేఎస్‌ కోరుతోంది. పొత్తుల్లో చాన్స్‌ దొరకని ఆశావహులకు వ్యూహాత్మాక స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి దించేందుకు టీజేఎస్‌ అనుమతించిందని ప్రచారం జరుగుతోంది. అయితే, శుక్రవారం కోదండరాం ఢిల్లీ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత రానుంది.

About admin

Check Also

అర్ధరాత్రి ఒక పక్క రేవంత్ అరెస్ట్, అదే సమయంలో గచ్చిబౌలిలో రేవంత్ ఆస్థుల పై, వైసీపీ నాయకుడి దౌర్జన్యం

గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో సర్వే నంబరు 126, 127లో ఉన్న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *