Home / News / గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్…..

గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్…..

గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి ప్రెస్ మీట్

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు మా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడటం చూస్తుంటే కల్లు తాగిన కోతి తాటి చెట్టు ఎక్కి ఎగిరి గంతేసి నట్లుంది. 2014 లో తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాలు కుటుంబ పాలన తీసుకొనివచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, వేల కోట్ల రూపాయల అవినీతితో బ్రెస్ట్ పట్టించిన చంద్రశేఖర రావు మరలా …
ప్రతిపక్షాలన్నీ ఏకమై మహా కూటమిగా ఏర్పడక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి, మహాకూటమి కి విజయవకాశాలు దగ్గరగా ఉండడంతో కల్లు తాగిన కోతిలా ఇష్టారాజ్యంగా మాట్లాడటం చూస్తున్నాం..

కెసిర్ ఒకటి గుర్తు పెట్టుకో…
చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో కేసిఆర్ ఒక మంత్రి మంత్రి పదవి ఇవ్వకపోతే పుట్టిన పార్టీ తెరాస పార్టీ.
మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీ పుట్టేది కాదు..
తెలంగాణ ఉద్యమం సమయంలో సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ చేసి,కోట్ల రూపాయలు వసూలు చేసి,
విధిలేని పరిస్థితులలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి,
స్వల్ప సీట్లతో గెలిచి, ఇష్టారాజ్యంగా
కుటుంబ పాలన చేస్తున్న చంద్రశేఖర్ రావ్..
కెసిఆర్ అహంకారానికి పాతరేసే రోజు వచ్చింది.సామరస్యంతో ఉండాలని చంద్రబాబు గారు చెప్తుంటే ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం.

పరిపాలన కూలిపోయే పరిస్తితి రావడం వలనే చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు.

అంతర్గతంగా బిజెపి ని గెలిపించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.
ప్రతి శుక్రవారం కోర్డమెట్లు ఎక్కే జగన్ కూడా చంద్రబాబునాయుడు గారిని విమర్శించడం ఏంటనీ మండిపడ్డారు.

అభివృద్ధి చేస్తున్న చంద్రబాబునాయుడు గారిపై ప్రశంసలు కురిపించడంతో పాటూ..
కెసిర్,మోడీ,జగన్ ల పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

వైసిపి నాయకులను జగన్ రాజకీయ గొంతు కోస్తున్నారు.బిజిపి ఐటి దాడులతో భయపెట్టలేదు.
టీడీపీ ని విమర్శించేందుకే జివియల్ కు పదవి ఇచ్చారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు గారు భగీరథ ప్రయత్నం చేస్తుంటే వైసిపి ప్రయత్నాన్ని అడ్డుకుంటుందనీ ఈ‌ సందర్భంగా ఆయన తెలియజేసారు.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *