Home / News / ఎన్టీఆర్‌పై ఇతర పార్టీ నేతలకు ఎంత అభిమానమో..? కనీసం ఎప్పుడైనా నివాళి అర్పించిన మొహలేనా..?

ఎన్టీఆర్‌పై ఇతర పార్టీ నేతలకు ఎంత అభిమానమో..? కనీసం ఎప్పుడైనా నివాళి అర్పించిన మొహలేనా..?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పొత్తు అనగానే.. ముందుగా చాలా మందికి వణుకు వచ్చేసింది. ఆ పొత్తు తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పేస్తుందేమో.. తమ రాజకీయ భవిష్యత్‌ను మరింత అంధకారం చేస్తుందేమోనని.. బాధపడిపోతున్నారు. అందుకే.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తేమిటని.. తెగ బాధపడిపోతున్నారు. దానికి ఎన్టీఆర్‌ సెంటిమెంట్‌ను వాడేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఢిల్లీ అహంకారంపై పోరాటానికే పార్టీ పెట్టారు. అహంకారాన్ని అణచి వేశారు. అప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది.అందుకే ఆ పార్టీపై పోరాడింది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది. కాంగ్రెస్‌ను మించిన అహంకారాన్ని ప్రదర్శిస్తోంది.

ఇప్పటి శతృవుపైన పోరాడాలా..? ఎప్పుడో ఓడిపోయిన శతృవు గురించి ఆలోచించాలా..? ఎన్టీఆర్‌ను ఎప్పుడూ.. కాస్త మంచిగా స్మరించుకోని వాళ్లంతా..ఇప్పుడు ఆయన ఆత్మ క్షోభిస్తుందంటూ.. తెగ మథనపడిపోతున్నారు. ఇలా మథనపడేవాళ్లలో తెలుగుదేశం పార్టీ నేతలు అస్సలు లేరు. ఉన్నదంతా.. టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నేతలే. ఒక్కసారిగా వీరికి ఎన్టీఆర్ ఆత్మ ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలుసా..?. తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరగడంతో వీరందరికీ ఒక్కసారిగా.. ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని.. పెట్టారని అలాంటి పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నారని.. ఆయన ఆత్మ క్షోభిస్తుందని.. దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని.. తెగ బాధపడిపోతున్నారు. అటు కిషన్ రెడ్డి దగ్గర్నుంచి..

ఇటు కృష్ణా జిల్లా వైసీపీ నేత పార్థసారధి వరకూ అందరితీ అదే బాధ. విశేషం ఏమిటంటే.. ఇలా అంటున్న వాళ్లతో చాలా మంది.. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారో.. అదే కాంగ్రెస్ పార్టీలో పుటి, పెరిగి.. పదవులు అనుభవించిన వాళ్లే. తెలంగాణలో పొత్తులపై ఇతర పార్టీల నేతలు.. ఎన్టీఆర్‌ను వాడేసుకుని రాజకీయంగా లబ్ది పొందుదామని అనుకుంటున్నారు. ఈ రియాక్షన్ అంతా.. ఇతర పార్టీల నుంచే వస్తోంది కానీ.. టీడీపీ నేతల దగ్గర్నుంచి రావడం లే్దు. తెలంగాణలో పొత్తులపై ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చని గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన టీడీపీ మంత్రులు ప్రకటించారు. ఆ తర్వాత వారు కూడా సైలెంటయ్యారు. కానీ బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ నేతలు మాత్రం.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోకూడదన్నట్లే విమర్శలు చేస్తున్నారు. అది వారి రాజకీయ వ్యూహంలో భాగం. ఎందుకంటే.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. గేమ్‌ చేంజర్‌గా మారుతుందన్నది వాళ్ల భయం కావొచ్చని.. టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *