Home / News / ముగ్గురిలో నిజమైన నాయకుడు ఎవరో గుర్తించండి…

ముగ్గురిలో నిజమైన నాయకుడు ఎవరో గుర్తించండి…

రాజకీయం అంటే సాధారణ విషయం కాదు. రాజకీయంలో ప్రజా సేవ ఉన్నా సరే ఆ ప్రజా సేవను సమర్ధవంతంగా తన వద్ద ఉన్న వనరులతో చేయగలిగే వాడే నిజమైన రాజకీయ నాయకుడు. రాజకీయంలో చాణక్యం ఎంత ముఖ్యమో ప్రజా సేవ కూడా అంతే ముఖ్యం.. ఇది సాధించగలిగిన వాళ్ళే సుధీర్గ కాలం పాటు రాజకీయం కొనసాగగలరు. ప్రజా సేవ విషయంలో అలసత్వం ప్రదర్శించిన వారు ఎదుర్కొనే పరిణామాలు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు నాయకుల కేంద్రంగా అదే జరుగుతుంది.

‘చంద్రబాబు’ తిత్లి తుఫాను కారణంగా దాదాపు మూడు రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లా అధికారులు, జిల్లా సరిహద్దు అధికారులతో నిత్యం మాట్లాడుతూ వారు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అధికారిక కార్యక్రమాలు పక్కన పెట్టి మరీ కష్టపడుతున్నారు. ఇక్కడ చంద్రబాబుని పొగడటం అని కాదు ఉన్న వాస్తవం మాట్లాడితే చంద్రబాబుని చూసి పలువురు జాలి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్న 2 గంటల వరకు అధికారులతో మాట్లాడిన ఆయన నిన్న ఉదయం లేచి పలు కార్యక్రమాల్లో పాల్గొని అధికారులతో సమీక్షలు జరిపారు. జిల్లా పర్యటనకు వెళ్లి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. అధికారులకు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేసి పలు సూచనలు చేశారు.

‘జగన్’ వంతుకి వస్తే తుఫాను వచ్చింది ఆయన పాదయాత్ర చేస్తున్న జిల్లాలోనే. తుఫాన్ పేరు చెప్పి పాదయాత్రకు సెలవు ఇచ్చి హైదరాబాద్ పయనమయ్యారు. ఈరోజు శుక్రవారం కావటంతో కోర్టులో హాజరు కావాల్సి ఉండటంతో ఆయన విశ్రాంతి కొనసాగుతుంది. జిల్లాలో ఉన్నప్పుడు పాదయత్రకి విశ్రాంతి ఇచ్చిన జగన్, సహాయ చర్యల్లో పాలుపంచుకుని ఉంటే ప్రజల్లో ప్రతిపక్ష నాయకుని పట్ల కాస్త విశ్వాసం వచ్చి ఉండేది. కానీ ఆయన చంద్రబాబుని విమర్శించడానికి కేటాయించే సమయంలో సగం అయినా ప్రజా సమస్యల పట్ల పెట్టి ఉంటే పాదయాత్ర ఉద్దేశం పరిపూర్ణమయ్యేది. తుఫాన్ పేరు చెప్పి విశ్రాంతి తీసుకునే ప్రతిపక్ష నేత, సహాయ కార్యక్రమాలు పూర్తయ్యాక వచ్చి విమర్శలు చేయటానికి మాత్రం పూర్తి సమయం కేటాయిస్తారు.తన పార్టీ కార్యకర్తలని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహింహల్సిన బాధ్యత జగన్ కి లేదా? కేవలం అధికారం అనుభవించటానికేనా ఆయన ఉన్నది?

ఇక ‘పవన్ కళ్యాణ్’ చెప్పుకుంటే చాట భారతం అంత ఉంటుంది.. ఉత్తరాంధ్ర మీద, ప్రత్యేకించి జిల్లాలో ఉన్న ఉద్దానం మీద ఈయన గారు ఒలకబోసిన ప్రేమతో జిల్లా తడిచి ముద్దింది. పాపం తుఫాను తో భారీ పంట, ఆస్తి నష్టం జరిగినప్పుడు మాత్రం కానిస్టేబుల్ కొడుకుని కారుకి వాయిదాలు కట్టలేక అమ్ముకున్నాను అని చెప్పిన ఆయన కాంగ్రెస్ లీడర్లకు వలలు వేసే క్రమంలో ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్ళారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు, సేల్ఫీలు కూడా దిగారు. కత్తులు పట్టండని పిలుపునిచ్చిన నోటితోనే జిల్లాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అని ఒక పిలుపునిస్తే నోట్లో ముత్యాలు ఎమన్నా రాలుతాయా.? ఇదే రాజకీయ పరిపక్వత అంటే.. ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు ఎవరు డ్రామాలు ఆడుతున్నారో. ప్రజలు, ప్రజల సమస్యల పట్ల నిజమైన అంకితభావం ఎవరికుందో ఈ మూడు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *