Home / News / వాట్సప్‌కు దీటైన మెసేజింగ్‌ యాప్‌లు

వాట్సప్‌కు దీటైన మెసేజింగ్‌ యాప్‌లు

స్మార్ట్‌ ఫోన్‌లు వాడుతున్నవారికి నిత్యజీవితంలో వాట్సప్‌ ఒక భాగమైపోయింది. 2009లో ప్రారంభించిన వాట్సప్‌ ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌గా విస్తరించి అందరి మన్ననలు పొందింది. 2016 వరకు వాట్సప్‌ సేవలు ఉచితంగా లభించేవి కావు. పెయిడ్‌ సేవలుగా ఉండేవి. అనంతరం దీనిని ఉచితం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. మనదేశంలో వాట్సప్‌కు 25కోట్ల యాక్టివ్‌ యూజర్స్‌ ఉన్నారు. వాట్సప్‌ను బాగా వాడుతున్న దేశాలలో ఇజ్రాయెల్‌ అగ్రస్థానంలో ఉంది. అయితే ఇటీవల గోప్యత, నమ్మశక్యం కాని వార్తలు వంటి విషయాలలో వాట్సప్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించే దిశలో ఆ సంస్థ ఉంది. కాగా వాట్సప్‌కు ధీటుగా ఎన్నో ప్రముఖ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్‌ వాడకందారులు వీటిని కూడా వాడి చూడవచ్చు. ఇటువంటి యాప్‌లలో హైక్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌, ఉయ్‌చాట్‌, వైబర్‌, లైన్‌ మొదలైనవి ఉన్నాయి. మార్పు కోరుకునేవారు ఈ యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని వాడి చూడవచ్చు. గోప్యత విషయంలో హైక్‌ యాప్‌కు మంచి పేరు ఉంది. ప్రైవేట్‌ చాట్‌ల సమాచారం కాపాడుకునేందుకు హైక్‌లో పాస్‌వర్డ్‌ విధానం అమలులో ఉంది. ఆకర్షణీయమైన స్టిక్కర్లు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. తాజా క్రికెట్‌ స్కోర్‌ వివరాలు కూడా ఈ యాప్‌లో లభిస్తాయి. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌, డెస్క్‌టాప్‌లకు మెసేజ్‌లను సింక్రనైజ్‌ చేసుకునే అవకాశం ఉంది. సిగ్నల్‌ యాప్‌లో కూడా గోప్యతకు ప్రాధాన్యత ఉంది. లేదంటే వాట్సప్‌ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *