Breaking News
Home / News / తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం వీరమాచినేని రామకృష్ణారావు సరికొత్త డైట్‌ సూత్రo

తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం వీరమాచినేని రామకృష్ణారావు సరికొత్త డైట్‌ సూత్రo

• తినండి… తగ్గండి!

* ఎక్కువ ఫ్యాట్‌తో ఎక్కువ ఆరోగ్యం
* బెజవాడ వాసి సృష్టించిన కొత్త ‘డైట్‌’
* అన్నం, చపాతీలు, పండ్లు, స్వీట్లు నిషేధం
* డ్రైఫ్రూట్స్‌, గింజలు, కొబ్బరి నూనె మేలు
* మంచినీళ్లు, ఉప్పులేని నీళ్ల మజ్జిగ..

• తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం
* అనుసరిస్తున్న వేలాదిమంది ప్రజలు
* అధిక బరువు నుంచి విముక్తి
* బీపీ, షుగర్‌, ఇతర జీవన శైలి రుగ్మతలకు చెక్‌
* షుగర్‌ను తరిమేస్తానంటున్న రామకృష్ణా రావు

ఆయన డాక్టర్‌ కాదు! పోషకాహార నిపుణుడూ కాదు! లెక్కలతో కుస్తీ పట్టే చార్టెర్డ్‌ అకౌంటెంట్‌! కానీ… ఆయన వేలాదిమంది జీవితాల ‘తిండీ-తిప్పల’ను మార్చేస్తున్నారు. చర్చలు, సమావేశాలు, యూట్యూబ్‌ వీడియోలతో హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. ‘‘ఇది వినండి.. ఇలా తినండి.. రోగాలు మీ దరి చేరవు. బరువు దించేసుకుంటారు. షుగర్‌ పరార్‌. జీవన శైలి రోగాలన్నీ గాయబ్‌’’ అని తేల్చి చెబుతున్నారు. సామాన్యులే కాదు… ఎంతో మంది వైద్యులు కూడా ఆయన చెప్పింది వింటున్నారు, తింటున్నారు. ఈ డైట్‌ పేరు… ‘లో కార్బ్‌- హై ఫ్యాట్‌’! అంటే… కార్బొహైడ్రేట్లు తక్కువగా తీసుకోవడం. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం! మీరు చదివింది నిజమే… కొవ్వు పదార్థాలను ఎక్కువగా తినడమే! తన సొంత సమస్యకోసం పరిష్కారాలు వెదికి… సరికొత్త డైట్‌ సూత్రాన్ని కనిపెట్టిన ఆయన పేరు వీరమాచినేని రామకృష్ణారావు! ఊరు విజయవాడ! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆహార నియమాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. అది కూడా సొంత ఖర్చుతో! అసలేమిటి ‘హై ఫ్యాట్‌ ఫుడ్‌’! మీరే చూడండి!

ఇది కార్బోహైడ్రేట్స్ ను పూర్తిగా avoid చేసి ఫాట్ అండ్ ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకొని డయాబెటిస్, బి.పి, కోలేష్ట్రల్ వంటి వాటిని నియంత్రించే పద్దతి అని చెపుతున్నారు. చాలా మంది ఈ పద్దతి పాటించి బెనిఫిట్ పొందామని చెపుతున్నారు.
నమ్మకం కలిగితే ఆచరించి చూడండి.

About admin

Check Also

Section 49p: ఓటు మాయమైతే తాట తీసే ‘సెక్షన్ 49P’

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు హడావిడి మొదలైంది. అభ్యర్ధులు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *