Home / Tourism Places / Gurazala / గురజాల శ్రీ పాతపాటేశ్వరిఅమ్మవారి తిరునాళ్ళ

గురజాల శ్రీ పాతపాటేశ్వరిఅమ్మవారి తిరునాళ్ళ

పలనాటి మాతగా పేరొందిన శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు 29-11-17 నుంచి 04-12-17 వరకు గురజాల శ్రీ పాతపాటేశ్వరిఅమ్మవారి తిరునాళ్ళ జరుగుతుంది.పలనాటి మాతగా శ్రీ పాతపాటేశ్వరి అమ్మ దశాబ్దాలుగా పూజలందుకొంటోంది. గురజాల నడి బొడ్డున అమ్మవారి ఆలయం ఉండటం పల్నాడు వాసులకు గర్వకారణం. అమ్మవారి మహిమలు కోకొ ల్లలు.

అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి మెదలు బహుళ పాడ్యమి వరకు ఐదు రోజులు తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఏకాదశి రోజున అమ్మవారికి బియ్యం కొలత జరుగు తుంది. బియ్యం కొలిచి ముడుపు కడితే నాలుగో రోజు అమ్మవారి మహిమతో రెట్టింపు అవుతాయని భక్తుల విశ్వాసం. ఐదో రోజు అనగా పౌర్ణమి నాడు తిరునాళ్ల ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ పున్నమినే కోరల పున్నమి లేదా విష పున్నమి అని కూడ అంటారు. భక్తులు ఉదయాన్నే చేసిన గారె, బూరెలను కొరికి కుక్కలకు వేస్తారు. అలా చేస్తే తమలో ఉన్న విష స్వభావం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. శిడిమాను ఉత్సవం రైతులు పొలాల్లో పండిన గుమ్మడి, సౌర ధాన్యాలను శిడిమానుకు కడతారు. అమ్మవారి ఉత్సవ విగ్రహన్ని గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు ఇండ్ల ముందు హారతులు పట్టి, కానుకలు సమర్పిస్తారు. గురజాల ప్రాంతంలో జన్మించిన, ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నవారు తిరునాళ్లకు రావటం ఆనవాయితి. అమ్మవారిని కొలిచిన వారికి కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. పల్నాడు ప్రాంత భక్తులు అమ్మవారి తిరునాళ్ల కు అధిక సంఖ్య లో వచ్చి అమ్మ కృప పొందుతారు.

నవంబరు 29 బుధవారం అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యి అమ్మవారికి బియ్యం కొలత ఉత్సవం,నవంబర్ 30 గురువారం అమ్మవారి ఉత్సవ విగ్రహా గ్రామోత్సవం, డిసెంబర్1 శుక్రవారం అమ్మవారి గ్రామోత్సవం,డిసెంబరు 2 శనివారం అమ్మవారికి సమర్పించిన బియ్యం విడత కార్యక్రమం మరియు డిసెంబర్ 3ఆదివారం అమ్మవారికి పొంగళ్ళ సమర్పణ అమ్మవారికి పొంగళ్ళ సమర్పణ మరియు సాంప్రాదయ శిడిమాను ఉత్సవం డిసెంబర్ 4 సోమవారం అమ్మవారి వసంతోత్సవాలు నిర్వహిస్తారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *