Home / News / రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణకు తీవ్ర గాయాలు…

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణకు తీవ్ర గాయాలు…

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ హీరో, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆయనే స్వయంగా కార్ నడుపుతున్నట్టు తెలుస్తుంది. AP28BW 2323 కార్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే, ఆయన పరిష్తితి విషమంగా ఉందని, శ్వాస తేసుకొవటానికి ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. సంఘటనా స్థలం చూసిన వారు, కార్ అదుపుతప్పి, కార్ బోల్తా పడి, ఆక్సిడెంట్ అయినట్టు చెప్తున్నారు.

ప్రమాదంలో ఆయన కార్ లో నుంచి రోడ్డు పై పడ్డారు. ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదోమో అనే అక్కడి వారు చెప్తున్నారు. తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారును హరికృష్ణే నడుపుతున్నట్టు సమచారం. హరికృష్ణను హుటాహుటిన కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రమాద సమాచరం తెలిసిన వెంటనే హరికృష్ణ సోదరి పురందేశ్వరి ఆస్పత్రికి బయలుదేరారు. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జనకిరామ్‌ మృతిచెందారు.

 

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *