Home / News / చంద్రబాబుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు !!

చంద్రబాబుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు !!

రాజకీయాల్లో ప్రజాసేవే పరమావధి.. ప్రజా సేవలో ఉన్న నాయకుడికే నాలుగు ఓట్లు పడతాయి. ఈ సత్యం తెలియని ఎందరో రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళిన సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబాల నాయకులు సైతం ఎదుర్కొనే ఇబ్బంది ఇది.. ప్రజాసేవలో ఉన్న నాయకుడు మాత్రం ఎప్పుడు ప్రజల్లో మంచి అభిప్రాయంతోనే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎప్పుడు ముందు ఉంటారు.

సాధారణంగా చంద్రబాబు కష్టజీవి అని ఆయనను దగ్గరగా చూసిన వాళ్ళు ఏందరో చెప్పే మాట. 18 గంటలు మనిషి కష్టపడాలి అని చెప్పే చంద్రబాబు దానికి నిజంగా న్యాయం చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర౦ రెండుగా విడిపోయిన తర్వాత నవ్యా౦ద్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలో హూద్ హూద్ తుఫాన్ విశాఖను చిగురుటాకులా వణికించింది. ఆ సమయంలో విశాఖను చూసిన దాని అభిమానులు అయితే మా విశాఖ ఏంటి ఇలా అయిపోయింది అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలోనే టీం ఇండియా ఒక మ్యాచ్ విశాఖలో ఆడింది. టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ విశాఖకు సంబంధించిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. హూద్ హూద్ తుఫాన్ భీబత్సాన్ని మీడియాలో చూసిన వాళ్ళు రోహిత్ శర్మ ఫోటో చూసి ఇది విశాఖ ఫోటోనా..? ఇది అదేనా..? అసలు అక్కడ తుఫాన్ వచ్చిందా..? ఈ ప్రశ్నలకు సమాధానం చంద్రబాబు పడిన కష్టమే.. వారం రోజుల పాటు అక్కడే తిష్ట వేసి ఆర్ధిక లోటు ఉన్నా సరే ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నిద్ర లేని రాత్రులు గడిపిన ఆయన విశ్రాంతి అనేది తెలియకుండా కష్టపడిన ఫలితమే నేడు విశాఖ హూద్ హూద్ ని మర్చిపోవడానికి కారణం.

ఇప్పుడు పలాసతో పాటు ఎన్నో ప్రాంతాలు ఉత్తరాంధ్రలో తిత్లి తుఫాన్ కి వణికిపోయాయి. మళ్ళీ అదే చంద్రబాబు రాత్రి పగలు అనే తేడా లేకుండా సమీక్షలు సమావేశాలు జరుపుతూ.. అధికారులను సమన్వయం చేసుకుంటూ అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడుతూ చిన్న సమస్యను కూడా సానుకూలంగా మార్చుకుంటూ అండగా నిలిచారు. నాలుగు రోజుల నుంచి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు చంద్రబాబు. నిన్న ఒక మీడియా సమావేశం పెడితే దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అభిమానులు “గత 4 రోజులుగా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు… విశ్రాంతి తీసుకోండి, మిమ్మల్ని చూస్తుంటే మాకు కన్నీళ్లు ఆగటం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. రేపు పలాస తిత్లి ని మర్చిపోతే దానికి కారణం చంద్రబాబు.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *