Home / News / కేంద్రం మరొక కుట్రని బయట పెట్టిన శివాజీ, అలర్టుగా ఉండాలి

కేంద్రం మరొక కుట్రని బయట పెట్టిన శివాజీ, అలర్టుగా ఉండాలి

ఆపరేషన్ గరుడ పై ఎప్పటికప్పుడు తాజా సమాచారం ప్రజలకు ఇస్తూ, ఆంద్ర ప్రదేశ్ మీద, చంద్రబాబు మీద కేంద్రం చేస్తున్న కుట్రలని ఎండాకడుతున్నాడు సినీ నటుడు శివాజీ. ఇటీవల టీడీపీ నేతల ఇళ్లపై జరుగుతున్న దాడులపై కేంద్రాన్ని శివాజీ సూటిగా ప్రశ్నించారు. మీ టార్గెట్‌ చంద్రబాబు. దానికోసం రాష్ట్ర ప్రజలను హింసించే బదులు ఆయన్ను ఒకేసారి ఎన్‌కౌంటర్‌ చేయండి. చంద్రబాబుపై కోపంతో ఆంధ్ర ప్రజలకు అన్యాయం ఎందుకు చేస్తున్నారు? అని ప్రధాని మోదీని, బీజేపీని నటుడు శివాజీ నిలదీశారు. నలుగురు దుర్మార్గులు ఢిల్లీలో కూర్చుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నటుడు శివాజి మరో బాంబ్ పేల్చాడు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ జాతీయ పార్టీ ఏపీపై గురిపెట్టి ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో రంగంలోకి దిగుతోందని మ్యాప్ గీసి మరీ.. నటుడు శివాజీ పెద్ద హడావుడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండాదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చే జరిగింది. ఇటీవల సీఎం చంద్రబాబుకు ఓ రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి నోటీసుల అందబోతున్నాయంటూ ప్రకటించారు. శివాజీ ప్రకటించిన కొద్దిరోజుల వ్యవధిలోనే బాబ్లీ ప్రాజెక్టు చంద్రబాబు చేసిన ఆందోళన నేపథ్యంలో ఆయనకు మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో శివాజీ చేసిన ప్రకటనపై అప్పట్లో రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చజరిగింది. అయితే ఇప్పడు శివాజీ మరో బాంబ్ పేల్చాడు. ‘‘త్వరలో ఏపీలో అల్లర్లకు కుట్ర పన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్‌ చేస్తే ఏమీ రాదు. కేంద్రాన్ని ప్రశ్నించాలి. మోదీ అహంకారంతో కూడిన పరిపాలన చేస్తున్నారు. మోదీ, అమిత్‌షాలను ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. ప్రత్యేకహోదా అంశం రాజకీయ నిర్ణయమని… 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ స్పష్టంగా చెప్పారు. ఢిల్లీలో ప్రత్యేకహోదాపై చర్చ నడుస్తోంది. కుతంత్రాలతో ఏపీని చిన్నాభిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారు అని శివాజీ ఆరోపించారు. అయితే శివాజీ పేల్చినా తాజా బాంబ్ తో రాష్ట్రంలో ఒక్క సారిగా కలకలం మొదలయ్యింది. ఒక రాష్ట్రాన్ని అందులో ప్రజలను ఆ రాష్ట్ర నాయకత్వాన్ని కేవలం కక్ష పూరితంగా ఇంత నీచపు స్థాయిలో ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఇంకొకటి లేదు అంటే అతిశయోక్తి కాదేమో.  అయితే శివాజీ వెల్లడించిన తాజా విషయాలతో ప్రజల్లో సైతం కేంద్రం మీద అసహ్యం పెరిగింది అని వేరే చెప్పే పనిలేదు.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *