Home / News / నారా బ్రాహ్మణి ఆడ సింహం.. జై బాల‌య్య అంటూ కామెంట్స్ చేసిన మ‌నోజ్..

నారా బ్రాహ్మణి ఆడ సింహం.. జై బాల‌య్య అంటూ కామెంట్స్ చేసిన మ‌నోజ్..

‘‘శ్రీకాకుళం కోసం నారా బ్రాహ్మణి చేస్తున్నది చూస్తుంటే నిజంగా స్ఫూర్తి కలిగిస్తోంది. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళల్లో ఒకరు. ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు బ్రాహ్మిణి. కష్టాల్లో ఉన్న వారి కోసం నిలబడటం చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. లయన్ కూతురు ఎప్పటికీ లయనెస్. జై బాలయ్య’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు మంచు మనోజ్.

నారా బ్రాహ్మణి ఆడ సింహం అని ప్రశంసించారు సినీ నటుడు మంచు మనోజ్. సింహం లాంటి బాలయ్య బాబుకు… సింహంలాంటి బిడ్డే పుట్టిందని …. ఆమె ఆడ సింహం అని… జై బాలయ్య అని కామెంట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు అండగా నిలవాలని ఆమె తీసుకున్న నిర్ణయం తనకు స్ఫూర్తినిస్తోందని చెప్పారు. తాను చూసిన శక్తిమంతమైన మహిళల్లో నారా బ్రాహ్మణి ఒకరని మనోజ్ అన్నారు.


అవసరం, ఆపదలో ఉన్నప్పుడు స్పందించడం చాలా గొప్ప విషయం అన్నారు.హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నారాబ్రాహ్మణి. సంస్థ తరఫున తిత్లీ బాధిత శ్రీకాకుళం జిల్లాల్లో తుఫాను సాయం అందిస్తున్నారు. దీనికి సంబందించిన విశేషాలను సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. హెరిటేజ్ గ్రూప్ సంస్థల తరఫున ఆమె ఇప్పటికే రూ.66లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం వెల్ఫేర్ ఫండ్ కు అందించారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *