Home / News / ఈ రోజు ప్రెస్ కి రీలీజ్ చెయ్యమని, తన అభిమానులని ఉద్దేశించి, హరికృష్ణ రాసిన లేఖ…

ఈ రోజు ప్రెస్ కి రీలీజ్ చెయ్యమని, తన అభిమానులని ఉద్దేశించి, హరికృష్ణ రాసిన లేఖ…

చైతన్య రాధసారధి నందమూరి హరికృష్ణ గారు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారు. అయితే ఆయాన నిన్న తన అభిమానులని ఉద్దేశించి లేఖ రాసారు. ఈ రోజు ప్రెస్ కి రిలీజ్ చెయ్యమని కోరారు కూడా..

మరో నాలుగు రోజులల్లో హరికృష్ణ పుట్టిన రోజు. సెప్టెంబర్ 2న హరికృష్ణ జన్మదినం. పుట్టినరోజు జరగనున్న నేపథ్యంలో హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. పుట్టినరోజున అభిమానులకు సందేశం ఇవ్వాలని ముందుగా రాసి పెట్టుకున్న ఈ లేఖ ఆయన మరణించిన తర్వాత బయటికి వచ్చింది. ‘‘సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.”

“వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో జన్మదినం చేసుకోవల్సిన తమ అభిమాన నటుడు, చివరి లేఖ బయటకు రావటంతో, అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *