Home / News / చందమామలో సాయినాధుడు కనిపించాడు…. మీరు చూశారా..ఎంత‌వ‌ర‌కూ నిజం..!!

చందమామలో సాయినాధుడు కనిపించాడు…. మీరు చూశారా..ఎంత‌వ‌ర‌కూ నిజం..!!

చందమామలో సాయినాధుడు కనిపించాడు…. మీరు చూశారా..? మేంచూసాం..మ‌రి మాకెందుకు క‌న‌ప‌డ‌లేద‌బ్బా..? ఇదే ఇప్పుడు వాట్సప్ గ్రూపుల్లో న‌డుస్తొన్న‌ చర్చ… నిన్న రాత్రి చంద్రుడిలో సాయి బాబా రూపం కనిపించిందంటూ వాట్స్‌యాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. కొందరైతే తాము చంద్రబింబాన్ని ఫోటో తీశామనీ, అందులో సాయినాధుడు ఇలా వున్నాడంటూ ఫోటోలను సైతం షేర్ చేశారు. అస‌లే పౌర్ణ‌మి అందునా గ‌ణేష్ నిమ‌ర్జ‌న వేడుక‌లు సో ఇంకేముంది వార్త దావానంలా వ్యాపించింది.

ఇలా చంద్రుడిలో శిరిడి సాయిబాబా కనిపిస్తున్నారన్న అలా అలా సొషల్ గోడ‌లు దూకుతూ వార్త వైరల్ అయ్యింది. ఇక సాయి భక్తులు చంద్రబింబంలో శిరిడీ సాయి కనిపించాడని గ్రూపుల్లో చెప్పేస్తున్నారు. చంద్రుడిలో సాయిబాబా అంటూ ఇప్పుడు చాలా ఫోటోలు షేర్ అవుతున్నాయి. అయితే ఈ వార్త ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతం చుట్టుప‌క్క‌ల నుండి తొలుత బ‌య‌టికొచ్చింది. అన‌తి కాలంలొనే రాష్ట్ర‌మంతా వ్యాపించింది.

ఐతే సైంటిస్టులు ఎప్పటిలానే… అది అంతా అవాస్తవమనీ, ఎవరి భావనను బట్టి ఆ ఆకృతులను మనసులో ఊహించుకోవడం వల్లనే ఇలా కనిపిస్తూ వుండవచ్చని అంటున్నారు. వాళ్ల వాదన ఎలా వున్నా చందమామలో సాయినాధుడుని చూసామని సాయి భక్తులు చెప్తున్నారు. మరి ఇవాళ పౌర్ణమి… సాయినాధుడు ఎలా కనిపిస్తున్నాడో..!!

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *