Home / News / అందరూ ఊహించినట్టే, మోడీ సహకారంతో చెలరేగుతున్న కెసిఆర్… రేవంత్ రెడ్డి, బంధువుల ఇళ్ళ పై ఈడీ దాడులు..

అందరూ ఊహించినట్టే, మోడీ సహకారంతో చెలరేగుతున్న కెసిఆర్… రేవంత్ రెడ్డి, బంధువుల ఇళ్ళ పై ఈడీ దాడులు..

కెసిఆర్ వణికిపోతున్నాడు.. మోడీ ఎంత సహకారం చేసినా, కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వటంతో, తన నూకలు చెల్లుతున్నాయి అని కెసిఆర్ గ్రహించి, మోడీ సహకారంతో ప్రతిపక్షాల పై దాడులు చేపిస్తున్నాడు… అక్రమ రవాణా అంటే గుర్తుకువచ్చేది కెసిఆర్, అలాంటి కెసిఆర్, మొన్న జగ్గారెడ్డిని లోపల వేయించిన కెసిఆర్, ఈ రోజు తనకు అత్యంత ముప్పుగా ఉన్న రేవంత్ రెడ్డిని ఈడీతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటంతో, ఇక రేవంతే సియం అభ్యర్ధి అనే విధంగా, కాంగ్రెస్ ప్రాజెక్ట్ చేస్తుంది. దీంతో రేవంత్ కి ఉన్న క్రేజ్ కి, కెసిఆర్ బ్రేక్ వెయ్యటానికి, అత్యంత దారుణమైన స్టెప్ వేసాడు.

revanth 27092018

ఎన్నికల సమయంలో రేవంత్ లాంటి వాడిని కెలికి, తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. నా వెనుక మోడీ ఉన్నాడు, నేను ఏమైనా చేస్తా అని విర్రవీగుతున్నాడు కాని, వేసింది ఎంత భయంకరమైన రాంగ్ స్టెప్ అనేది గ్రహించలేకపోతున్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్ళల్లో కూడా సోదాలు జరుపుతుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్ట్రేట్. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది.

హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి తన సొంత నియోజవర్గంలో, భారీ సభ ప్లాన్ చేసారు. ఇది భగ్నం చెయ్యటానికే, కెసిఆర్ ఇలా భయపెడుతున్నట్టు తెలుస్తుంది.

తమ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, పెద్దఎత్తున కొడంగల్ లోని ఇంటి వద్దకు చేరుకుంటుండటంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఈ సోదాలేంటని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలకు వచ్చారని అభిమానులు విమర్శిస్తున్నారు. సోదాల విషయం తమకు ముందుగా తెలియదని అంటున్న పోలీసులు, ఆయన ఇంటి వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మూడు చోట్ల సోదాలు జరుగుతున్నాయని సమాచారం.

 

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *