Home / News / నా బంగారుతల్లి ప్ర‌మాధంలో ఉంది ఏమీ అనోద్దు..మిడియాకు మారుతీరావు మ‌రో సంచ‌ల‌నాత్మ‌క లేఖ‌

నా బంగారుతల్లి ప్ర‌మాధంలో ఉంది ఏమీ అనోద్దు..మిడియాకు మారుతీరావు మ‌రో సంచ‌ల‌నాత్మ‌క లేఖ‌

న‌మ‌స్క‌రమండీ నేను మారుతీరావును..అంటూ మ‌రో లేఖ‌ను విడుద‌ల చేసారు అమ్రుత తండ్రీ. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా క‌లిసిన ఓ మీడియా ప్ర‌తినిధిద్వారా త‌న రెండొవ లేఖ‌ను విడుద‌ల చేసారు. త‌న మోద‌టి లేఖ కు వ‌చ్చిన స్పంద‌న‌ప‌ట్ల సంత్రుప్తి వ్య‌క్తం చేసార‌య‌న‌. త‌న‌ను అర్ధం చేసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రెండ‌వ‌లేఖ‌లో్ అమ్రుత గురించి కీల‌క విష‌యాలు వెళ్ళ‌డించారు. ఆ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే విందాం..

న‌మ‌స్కారం అండీ నేను మారుతీరావును..
మిర్యాలగూడా ఉదంతంలో మీ అంద‌రికీ చిర ప‌రిచితుడిని..మీ పొరుగింటి వాడిని. న‌మ్మ‌క ద్రోహానికి గురి కాబ‌డి జైలులో శిక్ష అనుభ‌విస్తున్న వాడిని. ఓ నిస్స‌హాయ తండ్రిని. ఇలా స‌మాజంలో అన్నింటికి దూర‌మై మాయ‌ని మ‌చ్చ‌ని నామీద వేసుకున్న నాకు మీరిచ్చిన ఆపూర్వ మ‌ద్ద‌తుకు మీ అంద‌రికీ రుణ‌ప‌డి ఉంటాను. ఓ ర‌కంగా నేను అప్పుడే చ‌నిపోయాను..నా బంగారు త‌ల్లి న‌న్ను ఉరితీయాలి, చంపాలీ అన్న‌ప్పుడే. కానీ నాకు మీరిచ్చిన మ‌ద్ద‌తు నన్ను ఓదార్చింది. బాగా బ్ర‌తికిన వ్య‌క్తిత్వం నుండి అంద‌రి ముందు వేలెత్తి చూపించుకునే స్ధాయికి దిగ‌జారాన‌నే ఫీలింగ్ నాకు దూరం అయ్యింది. చేసింది మంచో చెడో..నా నిస్స‌హాయ ప‌రిస్తితులు నన్ను ఆవైపు అడుగేసేలా చేసాయి. త‌ప్ప‌లేదు. అయితే ప‌ర్య‌వ‌సానాలు ఆలోచించుకునే శిక్ష‌ను అనుభ‌వించేందుకు నిర్ణయించుకున్నాకే..అమ‌లు ప‌రిచాను. నేను స‌మాజం ద్రుష్టిలో తప్పు చేసాను. క‌నుక శిక్ష అనుభ‌వించేందుకు సిద్ద‌మే.

అయ్యా అమ్మా..నా గురించి మంచిగా ఆలోచించి న‌న్ను అర్ధంచేసుకున్నందుకు మీకు రుణ‌ప‌డి ఉంటాను. అయిన‌ప్ప‌టికీ నానుండి మీకొక్క మ‌న‌వి. ద‌య‌చేసి నాబిడ్డ‌ను మాత్రం ఏమీ అన‌వ‌ద్దు. తాను చిన్న పిల్ల‌, తాను ఏమి మాట్లాడుతుందో..ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో తెలియ‌ని త‌నం త‌న‌ది. త‌న‌వ‌య‌సు కేవ‌లం 19 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. క‌ష్టం అంటే ఏమిటో..స‌మాజం అంటే ఏమిటో..రాజ‌కీయాలు ఏమిటి అనే విష‌యాలు త‌న‌కు అస్సులు తెలియ‌కుండా పెంచాను. అస్స‌లు ఆ అవ‌స‌రం కూడా త‌నకి రాలేదు. అదే నేను చేసిన త‌ప్ప‌ని మ‌రోసారి ఒప్పుకుంటున్నాను. నేను మొద‌టి నుండి ఒక్క‌టే చెపుతున్నా..నా బిడ్డ‌ను ట్రాప్ చేసారు. త‌ను మాయ‌లో ఉంది. ఆ మాయ‌నుండి బ‌య‌ట ప‌డేరోజు త‌ప్ప‌క వ‌స్తుంది. త‌న‌ క‌ళ్ళ‌కి వాళ్ళు క‌ప్పిన ముసుగు తొలిగిపోయేరోజు ఎంతొ దూరంలో లేదు. ఇక అప్ప‌టి వ‌రకూ ఓపిక‌గా ఎదురుచూస్తాను.

కానీ నా బిడ్డ‌ను కొద్దిరోజులు ఏమీ అన‌కండి. ఇప్ప‌టికే తాను పుట్టెడు దుఖంలో ఉంది. ఇప్పుడు త‌న‌కి ఎవ‌రూ లేరు. ప‌క్క‌న ఉన్న‌వాళ్ళంతా త‌న‌ని ఏదోర‌కంగా వాడుకోవాల‌నే చూస్తున్నారు. అటు రాజ‌కీయ‌నాయ‌కులు కూడా నా బిడ్డ దెగ్గ‌ర వాలిపోయారు. కుల సంఘాలు మీడియా వారు శ‌వాల మీద పేలాలేరుకున్న‌ట్లు నా బిడ్డ‌ను వాడుకుంటున్నారు. ఇక‌పోతే ఇంకొంతమంది త‌న పేరుమీద ఉన్న ఆస్తిపై ఆశ‌లు పెట్టుకొని త‌ప్పుడు దారిలో కుట్రలు చేస్తున్నారు. మొద‌టి నుండి చేసిన కుట్ర‌లే ఇప్పుడూ చేస్తున్నారు. నా కూతురు 13 ఏళ్ళలోనే ప్రేమ‌లో ప‌డింద‌ని తెలిసిన నేను ఎన్నొర‌కాలుగా త‌న మ‌న‌సు మార్చేందుకు ప్ర‌య‌త్నించాను. కానీ అబ్బాయి త‌రుపు వాళ్ళేవ‌రూ ఆ ప‌నిచేయ‌లేదు. నేనొక్క‌డినే కంట్రోల్ లో పెట్టేందుకు ప్ర‌య‌త్నించి నా బిడ్డ ద్రుష్టిలో విల‌న్ అయ్యాను. ప్రోత్స‌హించిన వాళ్ళంతా ఇప్పుడు త‌న‌కు ఆప్తుల‌య్యారు.. ద‌య‌చేసి అర్ధంచేసుకోండి నా బిడ్డ ఎలాంటి ప్ర‌మాధ‌క‌ర ప‌రిస్తితుల్లో ఉందో.. ఇలా అంద‌రి నోళ్ళ‌లో నానితే త‌నకు భ‌విష్య‌త్తు ఉండ‌దు. ఎంత చెడ్డా తండ్రి మ‌న‌సు క‌దా.. త‌న పరిస్తితిని జీర్ణించుకొలేక పొతున్నా.. మీ అంద‌రినీ ఒక్క‌టే వేడుకుంటున్నా.. నా బిడ్డ‌ను కాపాడండి. ఏదో ర‌కంగా త‌ను మొస‌పోతున్న ద్రుష్ణాన్ని త‌న‌కు తెల‌య‌జేయండి. నేను అన్నీ ర‌కాలుగా ప్ర‌య‌త్నించి ఓడిపోయి.. మిమ్మ‌ల్ని వేడుకుంటున్నాను.

అమ్మా అమ్రుత..జాగ్ర‌త్త. ఇప్పుడు నిన్ను నువ్వే కాపాడుకొవాలి. ఆరోగ్యం జాగ్ర‌త్త‌.. మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇప్పుడు నా బిడ్డ‌కు మీరే త‌ల్లి తండ్రులు. నా పై ద‌య చూపించి నా బంగారాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోండి.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *