Home / News / మహాకూటమి మొదటి దశ చర్చలు పూర్తి.. అభ్యర్థులు వీరే!

మహాకూటమి మొదటి దశ చర్చలు పూర్తి.. అభ్యర్థులు వీరే!

మహాకూటమి మొదటి దశ చర్చలు పూర్తి అయ్యాయి. పొత్తులు, పోటీ స్థానాలపై తమ ప్రతిపాదనలను టీకాంగ్రెస్‌కు అందించాయి. సర్వేల ఆధారంగా పార్టీల బలాబలాలు అంచనా వేసి సీట్ల సర్దుబాటుపై రెండో దశ చర్చలు జరపాలని నిర్ణయించాయి.

కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ‌న‌స‌మితిలు క‌లిసి ప్ర‌జాకూటమిగా ఏర్ప‌డేందుకు ఇప్ప‌టికే నిర్ణయించాయి. కూటమి ఏర్పాటు, ఎజెండా, సీట్ల సర్దుబాటు విషయంలో ముందుకెళ్ళాల్సిన వ్యూహాలపై తొలిదశ చర్చలు పూర్తి చేసుకున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్‌కు కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే బాధ్యతను అప్పగించారు. కూటమి ఏర్పాటుకోసం పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలనే ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకోసం కూటమి పక్షాలు సహా కాంగ్రెస్ పరిస్థితి, అభ్యర్థుల బలంపైనా సర్వే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు.

సర్వే కోసం తాము పోటీ చేయద‌లిచిన సీట్ల‌పై టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కసరత్తు పూర్తి చేసి ప్రతిపాదిత జాబితాను కాంగ్రెస్‌కు అందజేశాయి. అందులో టీడీపీ 15, సీపీఐ12, టీజేఎస్ 25 స్థానాలకు సంబందించిన నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ముందుంచినట్లు తెలుస్తోంది. టీజేఎస్ మాత్రం కొన్ని ప్రత్యేక షరతులు పెట్టినట్లు సమాచారం. మహాకూటమికి కామన్ ఎజెండా రూపొందించాలని, అధికారంలోకి వస్తే ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్దత కల్పించాలని, దానికి కోదండరాంను చైర్మన్ చేయాలన్న కండిషన్ పెడుతున్నారు.

అదలా ఉంచితే పొత్తుల్లో ముఖ్య భూమిక పోషిస్తోన్న టీడీపీ ఏ స్థానాలను కోరుతున్నదనేది ఇప్పుడు టాపిక్‌గా మారింది. టీడీపీ 30 స్ధానాలు కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులు లేని సీట్లనే టీడీపీ కోరుతోంది. దీనికి సంబంధించి మొత్తం 19 నియోజ‌క‌వ‌ర్గాల అభ్యర్ధుల పేర్ల‌ను కాంగ్రెస్ పెద్ద‌ల ముందుంచారు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియ‌ర్లలంద‌రికి టికెట్లు ద‌క్కెలా జాబితా రూపొందించారు.

జాబితా ఈ ర‌కంగా ఉండనుంది
దేవరకద్ర – రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. మక్తల్ – కొత్తకోట దయాకర్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. మహబూబ్‌నగర్- చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్ ), మాజీ ఎమ్మెల్యే. రాజేంద్రనగర్-ఎమ్ భూపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు. శేరిలింగంపల్లి -మండవ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి లేదా మొవ్వ సత్యనారాయణ. కూకట్‌పల్లి- శ్రీనివాసరావు , కార్పొరేటర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – ఎం.ఎన్.శ్రీనివాసరావు, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు. సికింద్రాబాద్ – కూన వెంకటేష్‌గౌడ్. ఉప్పల్- వీరేందర్‌గౌడ్. ఖైరతాబాద్ -బి.ఎన్.రెడ్డి, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు. కోరుట్ల-ఎల్ .రమణ, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.

హుజూరాబాద్ – ఇనగాల పెద్దిరెడ్డి , మాజీ మంత్రి. ఆర్మూర్ – ఏలేటి అన్నపూర్ణ, మాజీ ఎమ్మెల్యే. పరకాల లేదా వరంగల్ వెస్ట్ – రేవూరి ప్రకాష్‌రెడ్డి. ఆలేరు – శోభారాణి, తెలంగాణ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు. కోదాడ – బొల్లం మల్లయ్యయాదవ్. మిర్యాలగూడ -శ్రీనివాస్ (వ్యాపార వేత్త, కమ్మ సామాజిక వర్గం). ఖమ్మం – నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ. సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే.

ఈ సీట్ల కోసం గట్టిగా ప‌ట్టుబ‌ట్టాల‌ని టీడీపీ భావిస్తోంది. ఈ సీట్ల‌లో క‌నీసం 15 సీట్ల‌లో పోటీ చేయాల‌ని నిర్ణయించింది. గ‌త ఎన్నిక‌ల్లో 15 సీట్ల‌ను గెలిచిన టీడీపీ ఈసారి ఖ‌చ్చితంగా గెలిచే సీట్ల‌నే తీసుకోవాల‌ని అనుకుంటుంది. అందుకే 19 పేర్ల‌తో జాబితాను కాంగ్రెస్‌కు అంద‌చేసింది. ఇక సీపీఐ 12 స్థానాలు, టీజేఎస్ 25 స్థానాల జాబితాను అందజేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఫ్లాష్ సర్వేకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఒకటి రెండు రోజుల్లో సర్వే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై రెండో దఫా చర్చలకు కూర్చునే అవకాశం ఉంది.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *