Home / News / తెరపైకి కల్యాణ్ రామ్ పేరు.. టీడీపీలోనూ ఉత్కంఠ

తెరపైకి కల్యాణ్ రామ్ పేరు.. టీడీపీలోనూ ఉత్కంఠ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాజకీయ వేడి రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ అసమతి సెగలను చల్లార్చేందుకు తన సర్వశక్తులనూ ఒడుతున్నారు. అధిష్ఠానంలోని కీలకమైన వ్యక్తులు, ముఖ్యనాయకులతో సంప్రదింపులు, సమావేశాల ద్వారా సగం అసమ్మతి నుంచి బయటపడ్డా కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్లు ఆయన అనుచరగణంలోని ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ నెలాఖరకు వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. మరో పక్క కొంతమంది కార్పొరేటర్లు వారం రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తూ గాంధీ తమను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గం ఇన్‌చార్జి శ్రీనివా్‌సరెడ్డి సమక్షంలో గాంధీతో కలిసి సదవగాహనకు వచ్చినా.. కొందరు మాత్రం అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. ఇదే బాటలో కొందరు ఉద్యమకారులు, రాష్ట్ర యువజన నాయకుడు కోమండ్ల శ్రీనివా్‌సరెడ్డి, 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శంకర్‌గౌడ్‌ కూడా తమ అసంతృప్తిని తన అనుచరులతో కలిసి వెళ్లగక్కు తున్నారు. వీరిని కూడా సమన్వయం చేసుకోవడానికి గాంధీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీటన్నింటినీ దాటి గాంధీ ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారా.. అని పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.
తెరపైకి పారిశ్రామికవేత్త…
చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు, పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందిస్తూ కీలకంగా వ్యవహరిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ నేత, భవ్యాగ్రూపు సంస్థల అధినేత వినిగళ్ల ఆనందప్రసాద్‌ కూడా టికెట్‌ రేసులో ఉన్నారని ఆయనకు అత్యంత సన్నిహితుల్లో కొందరు చెబుతున్నారు. ఆనంద ప్రసాద్‌ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ లోనూ ఉత్కంఠే…
కాంగ్రెస్‌ – టీడీపీ పొత్తు ఖరారైనప్పటికీ టికెట్‌ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు భిక్షపతియాదవ్‌ ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే టీడీపీకి అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గం కావడం, 2014 ఎన్నికల్లో 78 వేలకు పైగా మెజార్టీ ఇక్కడ రావడంతో పొత్తులో ఆ పార్టీకే ఇక్కడ టికెట్‌ దక్కుతుందని టీడీపీ శ్రేణులు గట్టిగా వాదిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
బీజేపీలోనూ…
ప్రస్తుతం నియోజకవర్గంలో కసిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు జ్ఞానేంద్రప్రసాద్‌ మరో ఇద్దరు యువనేతలు బీజేపీ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
టీడీపీలోనూ ఉత్కంఠే…
టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ మొవ్వా సత్యనారాయణ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల అభ్యర్థన మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడి పిలుపుతో టీడీపీలో చేరారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి 2015 వరకు పార్టీ కేడర్‌తో ఉన్న అనుబంధంతో మొవ్వా అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు. హఠాత్తుగా గురువారం సినీ నటుడు కళ్యాణ్‌రామ్‌ పేరు తెరపైకి రావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో టీడీపీ కేడర్‌తో విజయవాడ వెళ్లి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తనకు టికెట్‌ ఇవ్వాలని మొవ్వా కోరినట్లు తెలిసింది. ఇదే పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్‌, రాష్ట్ర నాయకుడు భానుప్రసాద్‌ కూడా అధినేత చంద్రబాబుకు ప్రొఫైల్‌ అందజేశారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *