Home / News / టీడీపీ అధ్యక్షుడిగా జూ.ఎన్టీఆర్ ..? ఆ బహిరంగ సభలో ప్రకటన ..?

టీడీపీ అధ్యక్షుడిగా జూ.ఎన్టీఆర్ ..? ఆ బహిరంగ సభలో ప్రకటన ..?

రసవత్తరంగా జరగబోయే తెలంగాణ ఎన్నికలు అన్ని పార్టీలకు ఎంతో కీలకమే. అందుకే ప్రతి పార్టీ తమ ప్రత్యర్థులకు ధీటుగా ఎన్నికల ఎత్తుగడలు వేస్తూ .. జనాల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ మహా కూటమిగా ఏర్పడ్డాయి. వీటన్నిటి ముఖ్య లక్ష్యం టీఆర్ఎస్ పార్టీ ఓటమే. అందుకే ఇప్పడు కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక తెలంగాణ టీడీపీ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ కొంచెం బలహీనపడింది. పార్టీలో ముఖ్య నాయకులంతా గులాబీ గూటికి చేరిపోయారు. అయితే.. నాయకులు వెళ్లిపోయారు కానీ కార్యకర్తలు అలాగే ఉండిపోయారు.

ఈ నేపథ్యంలో తెలంగాణాలో టీడీపీ బలపడాలని చూస్తోంది. అందుకే ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ని యాక్టివ్ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు.2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ తన ప్రసంగాలతో టీడీపీ నేతలని , అభిమానులనే కాకా , ఇతర పార్టీ నేతలని కూడా ఆకట్టుకున్నాడు . అంతలా సాగుతుంది ఎన్టీఆర్ ప్రసంగం . తరువాత కుటుంబం లో జరిగిన కొన్ని కారణాల వల్ల రాజకీయాలకి పూర్తిగా దూరమయ్యాడు . కేవలం సినిమాలపైనే దృష్టి సారించి , కేరియాలోనే వరుస బ్లాక్ బ్లాస్టర్స్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు . ఇటీవల జూనియర్హ ఎన్టీఆర్ తండ్రి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు .

ఈ కష్ట కాలం లో మామ చంద్రబాబు , బాబాయ్ బాలయ్య అన్ని తానై వ్యవహరించారు . దీంతో బాబు మరింత అభిమానం పెంచుకున్నాడు జూనియర్. రాజకీయం లో ఎన్టీఆర్ కి అనుభవం ఎలాగూ ఉంది కాబట్టి , సీఎం బాబు కి ఏపీ గురించి ఆలోచించటానికి సమయం సరిపోవటం లేదు . ఈ కారణం తో తెలంగాణ టీడీపీ బాధ్యతలని ఎన్టీఆర్ కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది . ఈ నిర్ణయాన్ని తన బాబాయ్ బాలకృష్ణ కూడా మద్దతుగా నిలిచాడు . దీనితో త్వరలో తెలంగాణ లో టీడీపీ భారీ బహిరంగ సభని పెట్టి , ఆ సభా వేదిక గా , లక్షలాది మంది అభిమానుల సమక్షం లో ఎన్టీఆర్ ని టీ . టీడీపీ కి అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *