Home / News / జియో ఎఫెక్ట్.. 60 వేల మంది ఉద్యోగులు ఔట్!

జియో ఎఫెక్ట్.. 60 వేల మంది ఉద్యోగులు ఔట్!

టెలికం రంగంలోకి వచ్చీ రావడంతోనే సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో దెబ్బకు చాలా టెలికం కంపెనీలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. జియో చవక ధరలను ఎదుర్కొని వినియోగదారులను నిలుపుకోవడం తలకుమించిన భారంగా మారడంతో కంపెనీలన్నీ టారిఫ్‌లను తగ్గించాల్సి వచ్చింది. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్నాయి. బయటపడే మార్గం కనిపించక కొన్ని సంస్థలు విలీన బాట పట్టగా, మరికొన్ని ఉద్యోగులపై పడ్డాయి. మరికొన్ని తట్టాబుట్టా సర్దుకున్నాయి. వొడాఫోన్ ఇండియా-ఐడియాలు ఒక్కటి కాగా, ఎయిర్‌టెల్-టెలినార్ విలీనంతో ఒక్కటయ్యాయి. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఎయిర్‌సెల్‌‌లు మూసివేతకు సిద్ధమయ్యాయి.

ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ రంగంలో ఏకంగా 60 వేల మంది ఉద్యోగాలకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 65 వేలమందికిపైగా ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉందని ఓ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్, ఫైనాన్షియల్ ఫంక్షన్స్ విభాగాల్లోని ఉద్యోగులపైనే వేటు పడే అవకాశం ఎక్కువగా ఉందని స్టాఫింగ్‌ సంస్థ టీమ్‌లీస్‌ సర్వీసెస్‌ పేర్కొంది. ఈ ఒక్క విభాగం నుంచి దాదాపు 8 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *