Home / News / టీడీపీలోకి నాలుగో సింహం, కాపు నేత‌ ఇక జ‌గ‌న్‌, ప‌వ‌న్‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ‌టం ఖాయం..!

టీడీపీలోకి నాలుగో సింహం, కాపు నేత‌ ఇక జ‌గ‌న్‌, ప‌వ‌న్‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ‌టం ఖాయం..!

అవును, నాలుగో సింహం టీడీపీలో చోర‌బోతుంది. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు, అలాగే టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చుక్క‌లు క‌నిపించ‌నున్నాయ‌ట‌. ఇంత‌కీ ఎవరా ఆ నాలుగో సింహం..? ఆయ‌న టీడీపీలో చేరితే.. చేరారు కానీ, ఆయ‌న చేరిక‌తో జ‌గ‌న్‌కు, ప‌వన్‌కు ప‌ట్ట ప‌గ‌లే చుక్క‌లు క‌నిపించ‌డ‌మేంటి..? ఇంత‌కీ ఆ కాపు నేత ఎవ‌రు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రి..!

ఇక అస‌లు విష‌యాని కొస్తే, జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ, ఈ పేరు తెలియ‌ని తెలుగు వారంటూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి, అలాగే, వైసీపీ నేత‌ల‌కు ఈయ‌న అత్యంత సుప‌రి చితుడు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఉన్న ల‌క్ష కోట్ల అక్ర‌మ ఆర్జ‌న ఆరోప‌ణ‌ల‌ను ఆధారాల‌తో స‌హా రుజువు చేయ‌డ‌మే కాకుండా, కోర్టులో జ‌గ‌న్ అవినీతి ప‌రుడ‌ని ఆధారాల‌తో స‌హా నిరూపించి, ఆర్థిక నేర‌గాళ్ల‌కు చ‌ట్ట‌ప‌రంగా వేసే 16 నెల‌ల జైలు శిక్షను అమ‌లు చేసేలా విధులు నిర్వ‌ర్తించ‌డంలో జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ స‌ఫ‌లీ కృతుడ‌య్యాడు.

అంతేకాకుండా, త‌న‌పై ఎన్ని రాజ‌కీయ ఒత్తిళ్లు వ‌చ్చినా అదురు, బెదురు లేకుండా త‌న విధిని నిస్వార్ధంగా విదుల‌ను నిర్వ‌ర్తించారు జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న యువ‌త ఆయ‌న‌కు సెల్యూట్ చేయ‌డ‌మే కాకుండా, నాలుగో సింహం అనే బిరుదును కూడా ఇచ్చేసింది. అదేనండీ.. జాతీయ చిహ్నంపై క‌నిపించే ఆ మూడు సింహాలు న్యాయానికి, ధ‌ర్మానికి, నీతికి ప్ర‌తిరూపాలైతే.. క‌నిపించ‌ని ఆ నాలుగో సింహ‌మేరా జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ (పోలీస్‌) అంటూ యువ‌త సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురిపించింది.

ఇదిలా ఉండ‌గా, జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ జ‌గ‌న్ కేసుల అనంత‌రం మ‌హారాష్ట్ర‌కు అద‌న‌పు డీజీపీగా బ‌దిలీ అయిన విష‌యం తెలిసిందే. కొద్ది నెల‌ల క్రిత‌మే జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా, త‌న‌కు వ్య‌వ‌సాయ రంగం అంటే ఇష్ట‌మ‌ని, ఆ రంగం నుంచి ప్ర‌జ‌ల‌కు త‌న సేవ‌లను అందించాల‌ని అనుకుంటున్న‌ట్టు ఇటీవ‌ల ఏపీలో ప‌ర్య‌టించిన ఆయ‌న మీడియా వేదిక‌గా చెప్పిన విష‌యం పాఠ‌కుల‌కు విధిత‌మే. అంతేకాకుండా, ఏపీకి సంబంధించిన వ్య‌వ‌సాయ రంగంపై త్వ‌ర‌లో సీఎం చంద్ర‌బాబును క‌లిసి త‌న మ‌న‌సులోని భావ‌న‌ల‌ను తెలిపి, చ‌ర్చిస్తాన‌ని చెప్పారు జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌. ఇలా, రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని త‌న మ‌నసులో ఉన్న కోరిక‌ను బ‌య‌ట పెట్టారు జేడీ ల్మీ నారాయ‌ణ‌,

,

నేప‌థ్యంలో జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ ఏ పార్టీలో చేర‌బోతున్నారన్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అయితే, జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ వైసీపీలో చేరే ప్ర‌స‌క్తే లేద‌ని, ఎందుకంటే, ల‌క్ష కోట్ల అక్ర‌మ ఆస్తుల కేసులో వైఎస్ జ‌గ‌న్‌కు అణువ‌ణువునా న్యాయ ప‌రంగా ముప్పుతిప్ప‌లు పెట్టారు జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌. ఆ క్ర‌మంలో వైసీపీలోకి జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ చేరిక ఉండ‌దు. ఇక, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన‌లోకి అంటారా..? ఈ ప్ర‌శ్న‌పై ఇటీవ‌ల స్పందించిన జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ జ‌న‌సేన‌లో త‌న చేర‌క ఉండ‌ద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చేశారు.

ఇక మిగిలింది అదికార టీడీపీ పార్టీ. ఇప్ప‌టికే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీపై జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ సానుకుల ధృక్ప‌థాన్ని క‌లిగి ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న నిర్వ‌హించిన మీడియా స‌మావేశాల్లో టీడీపీపై విమ‌ర్శ‌లు చేసింది లేదు. పైగా, చంద్ర‌బాబు పాల‌న భేష్ అంటూ కితాబు కూడా ఇచ్చేశారు. అంతేకాకుండా, ఇటీవ‌ల తాను ఏపీలో ప‌ర్య‌టించిన జిల్లాల్లో ఉన్న వ్య‌వ‌సాయ రంగ ప‌రిస్థితుల‌పై సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి చ‌ర్చిస్తాని, ఆ క్ర‌మంలోనే, ఈ నెల 15న సీఎం చంద్ర‌బాబును క‌లుస్తాన‌ని చెప్పారు జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌. అంటే, అప్పుడే జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ టీడీపీలో చేరిక ఉంటుంద‌ని సోష‌ల్ మీడియా వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *