Home / News / యూట్యూబ్‌ వీడియో డౌన్‌లోడ్‌ చేయండిలా..!

యూట్యూబ్‌ వీడియో డౌన్‌లోడ్‌ చేయండిలా..!

నచ్చిన వీడియో యూట్యూబ్‌లో చూసినప్పుడు అది వేరెవరికో షేర్‌ చేయాలంటే కేవలం లింక్‌ మాత్రమే పంపగలరు… అదే పూర్తిగా ఆ వీడియోని డౌన్‌లోడ్‌ చేసుకుని చూడాలంటే మాత్రం వీలుపడదు. దాని కోసం థర్డ్‌పార్టీ యాప్స్‌ చాలానే ఉన్నాయి. అయితే అందులో ‘కీప్‌విడ్‌’ అనే ఆండ్రాయిడ్‌ యాప్‌ ద్వారా మీ ఫోన్‌లోనే ఎంచక్కా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తరువాత కావాల్సిన యూట్యూబ్‌ లింక్‌ కాపీ చేసి సెర్చ్‌ బటన్‌ క్లిక్‌ చేసి అక్కడ పేస్ట్‌ చేయాలి. వెంటనే ఆ వీడియో ఓపెన్‌ అవుతుంది.. కుడివైపు కింద భాగంలో బాణం గుర్తు వస్తుంది.. దాన్ని క్లిక్‌ చేస్తే ఏ నాణ్యతలో వీడియో కావాలో ఎంపిక చేసుకోవచ్చు. 1080పీ క్వాలిటీ లేదా 480పీ, 360 ప్రేముల వీడియో నాణ్యత కనిపిస్తుంది.
అది ఎంపిక చేస్తే ఎంత మేర సైజ్‌ ఉంటుందో కూడా డిస్‌ప్లే చూపిస్తుంది. వాటిలో ఎంపిక చేస్తే నచ్చిన వీడియో డౌన్‌లో క్షణాల్లో డౌన్‌లోడ్‌ అవుతుంది. చాలా మందికి యూట్యూబ్‌ వీడియో లింక్‌ మొబైల్‌లో ఎలా కాపీ చేయాలని సందేహం కలుగుతూ ఉంటుంది. యూట్యూబ్‌ వీడియో షేర్‌ కొట్టిన వెంటనే వివిధ రకాల యాప్‌లు చూపించడంతోపాటు కాపీ లింక్‌ అనే ఆప్షన్‌ కూడా వస్తుంది. అక్కడ క్లిక్‌ చేసి కీప్‌విడ్‌ యాప్‌లో పేస్ట్‌ చేసి వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.. ఆయా వీడియోలను వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.. నచ్చిన వారికి నేరుగా వీడియో వాట్సప్‌ ద్వారా షేర్‌ చేయొచ్చు..
వీడియో నుంచి ఎంపీ3 కూడా..
కొన్ని వీడియోల్లో ఆడియో మాత్రం డౌన్‌లోడ్‌ అయితే చాలనుకుంటాం. వీడియో పాటల నుంచి ఆడియోని వేరు చేయడం కూడా కీప్‌విడ్‌ ద్వారా చేయొచ్చు.. సెర్చ్‌ బటన్‌ క్లిక్‌ చేసి లింక్‌ ఎంటర్‌ చేసిన తరువాత వీడియో కింద యారో మార్క్‌ వస్తుంది దాన్ని క్లిక్‌ చేసి ఆప్షన్లలో వీడియో కాకుండా ఆడియో క్వాలిటీ ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా 128కేబీపీఎస్‌ నాణ్యతతో ఆడియో డౌన్‌లోడ్‌ అవుతుంది. అదే విధంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి మిగిలిన సోషల్‌ మీడియాలో ఉండే వీడియోలు కూడా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది.. మరెందుకు ఆలస్యం మీరు ప్రయత్నించండి.. యూట్యూబ్‌ ఆఫ్‌లైన్‌లో కేవలం అదే యాప్‌లో ఎన్నిసార్లైనా చూడొచ్చు.. కాని విడిగా మన మెమొరీలోకి రాదు.. ఈ యాప్‌ ద్వారా ఎంచక్కా వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకోవడమే కాదు.. ఎవరికి కావాల్సిదే వారికి షేర్‌ చేయొచ్చు కూడా.. అయితే రెగ్యులర్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఇది లభించదు. అఫిషియల్‌ కీప్‌విడ్‌ సైట్‌లోకి వెళ్లి ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *