Home / News / ఫేక్ మార్ఫింగ్‌తో మళ్లీ దొరికిన వైసీపీ..!

ఫేక్ మార్ఫింగ్‌తో మళ్లీ దొరికిన వైసీపీ..!

వైఎస్‌ జగన్‌పై దాడి చేసింది ఆయన అభిమానే అని అందరికీ తెలుసు. ఆయన కుటుంబసభ్యులు.. ఆ శ్రీనివాసరావుతో… పని చేసిన వాళ్లు.. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్లు.. ఆయన కుటుంబ సభ్యులు అందరూ అదే చెబుతున్నారు. చివరికి ఫ్లెక్సీలు వేసుకున్న విషయ కూడా బయటపడింది. ఆ ఫ్లెక్సీ.. ఆయన ఫోనులో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. చిరిగిపోయిన ఆ ఫ్లెక్సీని పోలీసులు వాళ్ల ఇంట్లో గుర్తించారు. ఆయన వైసీపీ ఫ్యాన్స్ కాదన్న విషయాన్ని చెప్పుకోవడానికి… వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. శ్రీనివాసరావు.. లోకేష్, చంద్రబాబులతో ఫ్లెక్సీలు వేయించాడంటూ… మార్ఫింగ్ చేసి.. ఆన్ లైన్ లో పెట్టారు. అంతేనా.. ఇప్పుడు కొత్తగా… ఓ టీడీపీ ఐడెంటిటీ కార్డు కూడా తయారు చేశారు.

శ్రీనివాసరావు పేరుతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఐడెంటిటీ కార్డును ఆ పార్టీ నేత జోగి రమేష్ గొప్పగా ప్రదర్శించారు. కానీ అదంత ఫేకో సులువుగా అర్థమైపోతుంది. ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని… అమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఓ వ్యక్తి టీడీపీ ఐడెంటీటీ కార్డు తీసుకుని.. దాని పైన… పేర్లను మార్ఫింగ్ చేశారు. ముమ్మడి వరం నియోజకవర్గంలో ముమ్మడివరం వస్తుందని తెలియని.. ఫేకింగ్ సన్నాసులు.. తయారు చేసిన మార్ఫింగ్ ను తీసుకొచ్చి.. వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. దీన్నే జోగి రమేష్ అనే బురద నోరున్న నేత.. తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి తన పరువు పోగొట్టుకున్నారు. దీనిపై ఇప్పటికే… సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్లు పడుతున్నాయి.

మార్ఫింగ్ లు చేసి.. ఫేక్ రిపోర్టులతో.. ఎంత సానుభూతి కోసం ప్రయత్నించినా వర్కవుట్ కాదని… జోకులేస్తున్నారు. ఓ తప్పు చేసి… దాన్ని కప్పి పుచ్చుకోవడానికి… తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్న… వైసీపీ నేతల్ని చూసి జనం చీదరించుకునే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో.. వైసీపీ నేతలు.. ఎవరికీ సిగ్గుపడే పరిస్థితి లేదు. ఎందుకంటే.. వాళ్లు ఇప్పటికే దొంగ ప్రచారం..మార్ఫింగ్ లతో నగ్నంగా ఆన్ లైన్ లో ఊరేగుతున్నారు.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *