Home / News / మీ ఓటు ఉందో లేదో……?

మీ ఓటు ఉందో లేదో……?

మీ ఓటు ఉందో లేదో ఈ రోజే ఓటర్ జాబితాలో సరిచూసుకోండి. ఓటర్ జాబితా మీ బి ఎల్ ఓ దగ్గర ఉంటుంది (బి ఎల్ ఓ అంటే బూత్ లెవల్ ఆఫీసర్ . మీ ఊరిలో ఉండే అంగన్వాడి టీచర్ లేదా విఆర్వోలే బిఎల్ ఓ అయి వుంటారు. )
ఒక వేళ మీ ఓటు లేకపోతే వెంటనే మీ దగ్గర లోని మీ సేవ కి వెళ్ళి మీ ఓటు నమోదు చేసుకోవాలి.
ఆన్లైన్ లో ఓటు సరి చూసుకుని నమోదు చేసుకోటానికి https://www.nvsp.in/index.html లింక్ ఉపయోగించాలి. పూర్తి చేసిన ఫారం -6 ని, మీ బి ఎల్ ఓ కి ఇవ్వాలి. మండల స్థాయి లో అయితే పూర్తి చేసిన ఫారం -6 లు తాసిల్దార్ కార్యాలయం లో ఇవ్వాలి. మీ పోలింగ్ బూత్ పరిధి లో ఓటు లేని వారికి ఓటు నమోదు చేయించటం మీ భాద్యత.

Voter Helpline App మీ ఓటర్ ఐడి తెలిసి, ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ యాప్ మీకు ఎంతగానో ఉపయోగం

https://play.google.com/store/apps/details?id=com.eci.citizen&hl=en

ఈ నెల 15 వరకు మాత్రమే ఓటు నమోదు అవకాశం ఉండటంతో ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి మీ నియోజకవర్గంలోని మండల పార్టీ కమిటీ, గ్రామ పార్టీ కమిటీ, మండల పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రులు, కార్యకర్తలు వారి ఎండ్రాయిడ్ మొబైల్లో “ఓటర్ హెల్ప్ లైన్” యాప్ ని ప్రతి ఒక్కరి దాంట్లో “ఇన్ స్టాల్” చేయించండి. సెర్చ్ బాక్సులో ఆ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరి ఓటర్ ఐడి కార్డ్ చూసి (Epic No) నెం ఆధారంగా టైప్ చేసి చెక్ చేయ్యగలరు. ఒక వేళ్ళ మీరు పర్యవేక్షిస్తున్న పరిధిలో ఓట్లు డిలీట్ అయితే వెంటనే మీ పేరు, వివరాలతో తగిన ప్రూఫ్ అందించి ఫామ్-6 ఆప్లికేషన్ నింపి సదరు అధికారిని సంప్రదించి ఓట్లు రిజిస్టర్ చేయించగలరు.

మీకు ఓటు హక్కు ఉందా.. ఒకవేళ లేని యెడల వెంటనే ఫారం-6 ద్వారా వెంటనే ఆన్లైన్ లో సబ్మిట్ చెయ్యండి.

కొత్తగా ఓటు అప్లై చెయ్యాలి అనుకునే వాళ్లు:
https://www.nvsp.in/Forms/Forms/form6?lang=en-GB

మీ ఓటర్ ఐడి తెలియకపోతే:
https://electoralsearch.in/ ( లింక్ ఓపెన్ అయ్యిన తరువాత “Search by Details” ని క్లిక్ చెయ్యండి.)

About admin

Check Also

అదిగో.. అమరావతి

ఐదు కోట్ల మంది ఆంధ్రులు సగర్వంగా చెప్పుకొనేలా రాజధాని అమరావతిని నిర్మించేందుకు నాలుగేళ్లకుపైగా తాము పడుతున్న శ్రమ, తపన ప్రస్తుతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *