Home / Tourism Places / Gurazala / అధికారులు వేధిస్తున్నారా.. టీడీపీ ఎమ్మెల్యేకు ఫోన్ కొట్టండి

అధికారులు వేధిస్తున్నారా.. టీడీపీ ఎమ్మెల్యేకు ఫోన్ కొట్టండి

ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే ఆషామాషి కాదు. ఒక్కోక్కసారి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా ఉన్నా అవినీతి అధికారులతో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా సర్కార్ పథకాలు పేదలకు చెందాలంటే అధికారం యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయాలి. కానీ కాసులు చెల్లించమని వేధిస్తే, చేతులు తడపమని ఒత్తిడి తెస్తే తనకు ఫోన్ చేయాలని చెబుతున్నారు ఆ ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో ఎవరూ లంచం అడిగినా తనకు ఫోన్ చేయాలని తేల్చిచెప్పారు ఆయన. ఆ మాటతో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో రూల్, రూలింగ్ రెండు మారిపోయాయి.

గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా తానునున్నాని ముందుండే వ్యక్తి యరపతినేని శ్రీనివాసరావు అని ఆయనకు పేరుంది. ఒక్క గురజాలకే పరిమితం కాకుండా పల్నాడు ప్రాంతంలోని ప్రజలందరికీ అండగా నిలుస్తున్నారు. పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమమైనా ఆయనే ముందుంటారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ఒక్క మెసేజ్ పెడితే చాలు వెంటనే స్పందిస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. అయితే అన్ని విషయాల్లో ప్రజలతో మమేకమయ్యే ఆయన గురుజాల నియోజకవర్గంలో లంచగొండులపై కన్నెర్ర చేశారు. ఎవరైనా అధికారులు లంచం అడిగితే తనకు ఫోన్ చేయాలని నంబర్‌ను బహిరంగ పరిచారు. ఏ స్థాయి అధికారైనా లంచం అడిగితే తనకు ఫోన్ చేయాలని నంబర్ ఇచ్చారు. ‘లంచం అడిగితే 97033 55955 ఫోన్ కొట్టండి’ అంటూ యరపతినేని శ్రీనివాసరావు సూచించారు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *